విశాఖ నుంచి తెలుగు ఉద్యమం

First Published Feb 17, 2017, 9:13 AM IST
Highlights

విశాఖ నుంచి  తెలుగు పరిరక్షణ కోసం ఉద్యమిస్తానంటున్న పద్మభూషణ్ యార్లగడ్డ

ఇక లాభం లేదు,  తెలుగు భాషాభివృద్ధికి ఉద్యమించాల్సిందేనంటున్నారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.

 

సాధారణంగా  ఎన్నికల హామీలు అమలుచేయలేదని  ప్రతిపక్ష పార్టీలు ఉద్యమం చేస్తాయి. ఆంధ ప్రదేశ్ లో ఇపుడొక విచిత్రమయిన పరిస్థితి ఎదురువుతూ ఉంది.

 

తెలుగు భాషకు సంబంధించి ఎన్నికల ముందు, తర్వాత  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ లన్నింటిని అమలుచేయాలని ఆంధ్రా విశ్వవిద్యాయం మాజీ ప్రొఫెసరయిన లక్ష్మీ ప్రసాద్, అనేక  మంది పండితులు,మేధావులు, భాషా వేత్తలతో కలసి విశాఖ నుంచి ఉద్యమం మొదలుపెట్టాలనుకుంటున్నారు.

 

రాజకీయా వాగ్దానాలే కాదు, భాషకు సంబంధించిన వాగ్దానాలు కూడా  ముఖ్య  మంత్రి చంద్రబాబు నాయుడు అమలుచేయడం లేదని, అందువల్ల వాటన్నింటి కోసం ఇక ఉద్యమమే మార్గమని ఆయన చెప్పారు.

 

విశాఖలో మాట్లాడుతూ, వచ్చే తెలుగుభాషా దినోత్సం లోపు  ఈ హామీలను అమలుచేసే కార్యచరణ ప్రణాళిక  ప్రకటించపోతే, ఆరోజు  నుంచి ఇక భాషా ఉద్యమమే ఆయన హెచ్చరించారు.

 

ఆగస్టు 29న, తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామప్ప పంతులు జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు. 

 

ఆరోజునుంచి ఇంటింటికి తిరిగి, తెలుగు దేశం ప్రభుత్వం తెలుగు  మాటలకే పరిమితమయిదని, భాష పట్ల గౌరవం లేదని ప్రచారం చేస్తామని ఆయన  ప్రకటించారు.

 

విశాఖ లో  లోకనాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో ప్రొఫెసర్లు కెఎస్ చలం, చందుసుబ్బారావులతో కలసి  ఆయన ఈ విషయం వెల్లడించారు.

 

స్వాతంత్య్ర పోరాట యోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య స్ఫూర్తితో పల్లెపల్లెకు వెళ్లి ఇంటింటా ప్రభుత్వం  భాషా సంస్కృతులను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నదో వివరిస్తామని ఆయన చెప్పారు. 

 

పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ పాలనా భాషగా తెలుగును అమలుచేస్తామని, నవ్యాంధ్ర లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పలుసార్లు ప్రకటించారని చెబుతూ ముఖ్యమంత్రి మూడేళ్లు కావస్తున్నా వీటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు

 

రాష్ట్రంలో ప్రత్యేక తెలుగు కేంద్రం ఏర్పాటుచేస్తామని , దీనికి పదివేల చదరపు అడుగుల  స్థలం కేటాయిస్తామని అర్భాటంగాప్రకటించారని ఇపుడు ఈ ప్రకటన ఏమయిందో తెలియచేయాలని ఆయన చెప్పారు.

 

 తెలుగు పండితులు శిక్షణా కళాశాలలను ఏర్పాటుచేస్తామని,తెలుగు ప్రాచీన తాళ  పత్ర గ్రంథాలను డిజిటైజ్ చేస్తామని చెప్పారని, అయితే ఇందులో ఒక్క పనిమొదలుకాలేదుని ఆయన  ఆవేదన వ్యక్తం చేశార.

 

ప్రొఫెసర్ కెఎస్ చలం మాట్లాడుతూ తెలుగు భాషను తెలుగు ప్రభుత్వమే అవమానపరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దోరణి కొనసాగితే తెలుగుభాష ఉనికికే ముప్పు వాటిల్లుతుందని  ఆయన అన్నారు. పాఠశాల స్థాయినుంచి ఇంగ్లీ మీడియం ప్రవేశపెడుతున్న ప్రభత్వం తెలుగును నిర్లక్ష్యం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

 

click me!