పళనిస్వామికి షాక్..

Published : Feb 17, 2017, 08:27 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
పళనిస్వామికి షాక్..

సారాంశం

శశికళపై ప్రజల్లో ఏ స్ధాయిలో ఆగ్రహం ఉందో పళనిస్వామి తదితరులకు స్పష్టంగా తెలిసింది. దాంతో  శనివారం జరగబోయే బలపరీక్షలో ఏం జరగబోతోందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామికి ఊహించని షాక్. స్వపక్షంలోని ఎంఎల్ఏలే ఎదురుతిరుగుతునట్లు సమాచారం. పళనిస్వామి సిఎంగా ప్రమాణస్వీకారం తర్వాత ఎవరూ ఊహించని పరిణామాలు మొదలయ్యాయి. ప్రమాణం చేయటానికి రిసార్ట్స్ నుండి రాజ్ భవన్ కు వస్తున్న శశికళ వర్గం ఎంఎల్ఏల వాహనాలపై జనాలు ఉమ్మేసారట. వారిపై ఇసుకు చల్లటంతో పాటు శాపనార్ధాలూ పెట్టారట. దాంతో శశికళపై ప్రజల్లో ఏ స్ధాయిలో ఆగ్రహం ఉందో పళనిస్వామి తదితరులకు స్పష్టంగా తెలిసింది. దాంతో  శనివారం జరగబోయే బలపరీక్షలో ఏం జరగబోతోందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇదిలావుండగా బలపరీక్షకు హాజరు కావాలంటూ 134 మంది ఎంఎల్ఏలకూ పళనిస్వామి విప్ జారీ చేయటం గమనార్హం.

 

సరే, శశికళ వర్గంలో కొంత ఆందోళన నెలకొన్నాముందైతే ప్రమాణస్వీకారం చేసేసారు. తర్వాతే ఎంఎల్ఏల్లో అంతర్మధనం మొదలైందని చెబుతున్నారు. స్వయంగా జయలలితే సిఎంగా నియమించిన పన్నీర్ సెల్వంను అవమానకరంగా ముఖ్యమంత్రిగా దింపేయటంతో  ప్రజల్లో ఆగ్రహం మొదలైనట్లు చిన్నమ్మ వర్గం గ్రహించింది. దాంతో తమ రాజకీయ భవిష్యత్తుపై పలువురిలో ఆందోళన మొదలైంది. పళని వర్గంలోని 124 మంది శాసనసభ్యుల్లో 40 మంది కొత్తగా ఎన్నికైన వారేనట. దాంతో తమ రాజకీయ భవిష్యత్ పై వారిలో భయం మొదలైంది.

 

దానికి తోడు మైలాపూర్ ఎంఎల్ఏ నటరాజ్ పళనిస్వామికి మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తాను అమ్మ వల్లే గెలిచానని, శశికళ వర్గానికి చెందిన పళనిస్వామికి ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓటు వేయనని బాహాటంగానే చెప్పారు. దాంతో పలువురు ఎంఎల్ఏల్లో ఇదే ఆలోచన మొదలైంది. పళనిస్వామి కేవలం శశికళకు మాత్రమే నమ్మినబంటని నటరాజ్ చెబుతున్నారు. జయలలిత దూరంగా పెట్టిన వాళ్లందరినీ శశికళ ఇపుడు మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు నటరాజ్ చెబుతున్నారు. నటరాజ్ వాదనతో ఏకభవించే ఎంఎల్ఏలు సుమారు 30  మంది వరకూ ఉన్నారట. దాంతో వారంతా రేపటి బలపరీక్షలో ఏం చేయనున్నారనేది సస్పెన్స్ గా మారింది.

 

బలనిరూపణకు గవర్నర్ పళనిస్వామికి 15 రోజులు గడువిచ్చినా సిఎం మాత్రం 2 రోజులే చాలంటూ శనివారమే బలపరీక్షకు దిగారు. అయితే, ఊహించని పరిణామాలు ఏర్పడటంతో బలపరీక్షపై గందరగోళం మొదలైంది. ఇంకోవైపు బలపరీక్షను సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్వహించాలంటూ పన్నీర్ సెల్వం గవర్నర్ కు లేఖ రాసారు. సిఎం బలపరీక్షలో గెలవాలంటే 117 మంది ఎంఎల్ఏలు మద్దతవసరం. పళనికి 124 మంది ఎంఎల్ఏల మద్దతుంది. అయితే, రేపటి రోజున శశికళ వర్గంలోని ఓ పంది మంది గనుక ఓటు వేయకపోయినా లేదా దూరంగా ఉన్నాపళనిస్వామి ప్రభుత్వం కూలిపోతుంది. చూడబోతే రాష్ట్రపతి పాలన తప్పదేమో అన్న అనుమానాలే వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu