ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం: అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ రాజీనామా

By Sumanth KanukulaFirst Published Sep 21, 2022, 12:06 PM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మనస్తాపం చెందారు. తన పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సరికాదని అన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తానని అప్పట్లో వాజ్‌పేయి చెప్తే చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. ఇక, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ అసెంబ్లీ‌లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. క్రెడిట్ లక్ష్మీ పార్వతికి వస్తుందని చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. 

మరోవైపు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని చెప్పారు. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని అన్నారు. 

click me!