ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై టీడీపీ సభ్యులు అసెంబ్లీలో నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయం నుండి టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో ప్ల కార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. వెల్ లోకి నిరసన చేశారు. స్పీకర్ పై పేపర్లు చింపి వేశారు. స్పీకర్ తన ఇయర్ ఫోన్స్ టేబుల్ పై విసిరికొట్టారు.ఈ సమయంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.
undefined
టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు.ఈ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చొద్దని నినాదాలు చేశారు. స్పీకర్ కుర్చి దగ్గరకు చేరుకొని నినాదాలు చేశారు.ఈ సమయంలో ఏపీ శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. టీడీపీ సభ్యుల పేర్లను చదివి సభ నుండి వారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.
also read:ఎన్టీఆర్ పై చంద్రబాబు కంటే జగన్ కే ప్రేమ ఎక్కువ: ఏపీ మంత్రి జోగి రమేష్
అయితే సస్పెన్షన్ తీర్మానం చేయకుండా సస్పెండ్ చేయడమేమిటని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. సస్పెన్షన్ విషయమై తాను ప్రకటన చేశానని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన సభ్యులను వెంటనే సభ నుండి బయటకు పంపాలని మార్షల్స్ ను ఆదేశించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
వరుసగా ఐదో రోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నెల 15వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15, 16, 19, 20, 21 తేదీల్లో అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.ఈ నెల 15న అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణపైజరిగిన చర్చ సందర్భంగా పయ్యావుల కేశవ్ పై మాట్లాడే అవకాశం కల్పించాని టీడీప సభ్యులు ఆందోళనకు దిగడంతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నెల 16, 19 తేదీల్లో వాయిదా తీర్మానాలపై టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సస్పెన్షన్ కు గురయ్యారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని నిన్న కూడ సభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై ఇవాళ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండయ్యారు.