ఎన్టీఆర్ పై చంద్రబాబు కంటే జగన్ కే ప్రేమ ఎక్కువ: ఏపీ మంత్రి జోగి రమేష్

Published : Sep 21, 2022, 10:59 AM IST
ఎన్టీఆర్ పై చంద్రబాబు కంటే జగన్ కే ప్రేమ ఎక్కువ: ఏపీ మంత్రి జోగి రమేష్

సారాంశం

చంద్రబాబు కంటే జగన్ కే ఎన్టీఆర్ పై ప్రేమ ఉందని  ఏపీ మంత్రి జోగి రమేష్ చెప్పారు.  హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఆయన సమర్ధించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన టీడీపీ సభ్యులు ఆయనపై ప్రేమ ఉన్నట్టు నాటకాలాడుతున్నారన్నారు.  

అమరావతి: ఎన్టీఆర్ పై చంద్రబాబు కంటే సీఎం జగన్ పైనే ప్రేమ ఎక్కువగా ఉందని ఏపీ మంత్రి జోగి రమేష్ చెప్పారు.అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత  బుధవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారన్నారు.హెల్త్ యూనివర్శిటీపై  బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొనవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై టీడీపీ సభ్యులకు అంత ప్రేమ ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై నిజంగా ప్రేమ ఉంటే ఆయనపై వైస్రాయి హోటల్ వద్ద రాళ్లు, చెప్పులు ఎందుకు వేస్తారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.

also read:జగన్ సర్కార్ కు చివరి రోజులు: హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై పయ్యావుల కేశవ్

ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా  పార్టీ ఆఫీసును, పార్టీని లాక్కొన్నారని  జోగి రమేష్ విమర్శించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడతామని పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.  వైద్య రంగంలో వైఎస్ఆర్ చేసిన సేవలకు గాను హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్