అప్పులపై ఆర్థికమంత్రి పిట్టకథలు... అసలు లెక్కలివి...: బయటపెట్టిన యనమల

Arun Kumar P   | Asianet News
Published : Mar 05, 2021, 05:32 PM ISTUpdated : Mar 05, 2021, 05:42 PM IST
అప్పులపై ఆర్థికమంత్రి పిట్టకథలు... అసలు లెక్కలివి...: బయటపెట్టిన యనమల

సారాంశం

60 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేసి అనేక అభివృద్ధి పథకాలు చేసిందని... 20 నెలల్లో జగన్ రెడ్డి రూ.1.55 లక్షల కోట్లు అప్పు చేసి కూడా అభివృద్ధి ఏమీ చేయలేకపోయారని మాజీ ఆర్థిక మంత్రి యనమల ఆరోపించారు. 

అమరావతి: గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల నేడు ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చిందన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన పచ్చి అబద్ధమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కరోనా వల్ల రాబడులు తగ్గాయనేది కూడా వాస్తవం కాదని... గత ప్రభుత్వం కన్నా కరోనా కష్టకాలంలోనే ఎక్కువ రెవెన్యురాబడులు వచ్చాయనేది అక్షరసత్యమని యనమల అన్నారు.

''60 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేసి అనేక అభివృద్ధి పథకాలు చేసింది. 20 నెలల్లో జగన్ రెడ్డి రూ.1.55 లక్షల కోట్లు అప్పు చేసి కూడా అభివృద్ధి ఏమీ చేయలేకపోయారు. సంక్షేమం కూడా చంద్రబాబు ప్రభుత్వం కన్నా ఎక్కువేమీ చేయలేదు. రైతు రుణమాఫీ రద్దు, నిరుద్యోగ భృతి రద్దు, అన్న క్యాంటీన్ల రద్దు, చంద్రన్న బీమా రద్దు, పండుగ కానుకలు రద్దు, విదేశీవిద్య రద్దు లాంటి 34 సంక్షేమ పథకాలు రద్దు చేశారు'' అని ఆరోపించారు. 

''అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్నబుడ్డి ద్వారా ఏడాదికి రూ.36 వేలు గుంజుకుంటున్నారు. వాహనమిత్రకు రూ.10 వేలు ఇచ్చి జరిమానాల పేరుతో డీజిల్ రేట్లు పెంచి రూ.30 వేలు కొట్టేస్తున్నారు. సెంటు పట్టా పేరుతో రూ.6500 కోట్లు అవినీతి చేశారు. వైసీపీ సంక్షేమం మోసకారి సంక్షమమే. కంటికి తెలియకుండా కాటుక కొట్టివేయడమే. 20 నెలల్లో తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు, ధరల వల్ల ఒక్కో కుటుంబంపై రూ.2.5 లక్షల రూపాయల భారం మోపారు. ప్రభుత్వ నిధులు, సహజ వనరుల దోపిడీతో లక్ష కోట్లు జగన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు మేసివేశారు. ఈ మితిమీరిన అవినీతి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. అప్పులు తీర్చడానికి ఆస్తి పన్ను పెంపుతో పాటు ఇతరత్రా ఎడాపెడా పన్నులు, ధరలు పెంచుతున్నారు'' అని యనమల వెల్లడించారు.

యనమల బయటపెట్టిన లెక్కలు...

జగన్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన అప్పులు
1. 2019-20లో చేసిన అప్పులు (బడ్జెటరీ అప్పులు)    రూ.46,503.21 కోట్లు  
2. 2020-21లో జనవరి వరకు చేసిన అప్పులు     రూ.73,912.91 కోట్లు 
3. వివిధ కార్పొరేషన్ల అప్పులు 20 నెలల్లో (బడ్జట్ యేతర)    రూ. 34,650.00 కోట్లు)
  ---------------------------------------
20 నెలల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు     రూ.1,55,066.12 కోట్లు
                                                                         
(ఆధారం- కాగ్ రిపోర్ట్ మరియు STC డాక్యుమెంట్స్) 
చంద్రబాబు ప్రభుత్వం 60 నెలల్లో చేసిన అప్పు 
(ఆధారం:RTI, Letter No.Fin 01-Bugt/7/2020 C&DM)
1.    2014-15లో చేసిన అప్పు         రూ.18,089.11 కోట్లు
2.    2015-16లో చేసిన అప్పు          రూ.25,110.15 కోట్లు
3.    2016-17లో చేసిన అప్పు         రూ.23,599.96 కోట్లు
4.    2017-18లో చేసిన అప్పు         రూ.25,064.93 కోట్లు
5.    2018-19లో చేసిన అప్పు         రూ.38,282.83 కోట్లు
    --------------------------------------
మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పు                                రూ.1,30,146.98 కోట్లు
                                                    
వివిధ రాష్ట్రాల్లో 2020-21 జనవరి వరకు చేసిన అప్పులు
క.స    రాష్ట్రం            2020-21 ప్రభుత్వ అప్పులు  2020-21 రెవెన్యూ రాబడులు
1      ఆంధ్రప్రదేశ్     రూ.73,912 కోట్లు    రూ.88,238 కోట్లు(జనవరి వరకు)
2      తెలంగాణ         రూ.43,930 కోట్లు    రూ.74,990 కోట్లు
3      తమిళనాడు      రూ.49,844 కోట్లు    రూ.1,27,748 కోట్లు
4       కేరళ                రూ.37,798 కోట్లు    రూ.70,578 కోట్లు
5      కర్ణాటక              రూ. 30,229 కోట్లు    రూ.1,19,090 కోట్లు
6      మహారాష్ట్ర        రూ. 35,725 కోట్లు    
7      ఒడిస్సా            రూ.3,425  కోట్లు    రూ.75,452 కోట్లు
8     ఉత్తరప్రదేశ్      రూ. 28,653 కోట్లు    
9     రాజస్థాన్           రూ. 44,708కోట్లు    రూ.98,481 కోట్లు


ఏపీ ప్రభుత్వ రెవెన్యూ రాబడులు
1.    2018-19 రూ.74,912 కోట్లు (చంద్రబాబు ప్రభుత్వ హయాంలో)
2.    2019-20 రూ.85,987 కోట్లు (జగన్ ప్రభుత్వ హయాంలో
3.    2020-21 రూ.88,238 కోట్లు (జనవరి వరకు)

PREV
click me!

Recommended Stories

ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu