వైసిపి కరపత్రంపై బహిరంగచర్చకు సిద్ధమే... సజ్జల సిద్ధమా?: అశోక్ బాబు సవాల్

Arun Kumar P   | stockphoto
Published : Mar 05, 2021, 04:29 PM IST
వైసిపి కరపత్రంపై బహిరంగచర్చకు సిద్ధమే... సజ్జల సిద్ధమా?: అశోక్ బాబు సవాల్

సారాంశం

జగన్ ప్రభుత్వంలో పనీపాటాలేని సలహాదారులు 30మంది వరకు ఉన్నారని... వారికిమాత్రమే ఈ ప్రభుత్వం మంచిచేసిందని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. 

అమరావతి: ''మంచిచేసిన ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో మద్ధతు పలకండి'' పేరుతో కరపత్రం విడుదలచేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు విరుచుకుపడ్డారు. అసలు వైసీపీ ప్రభుత్వం ఎవరికి మంచిచేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో పనీపాటాలేని సలహాదారులు 30మంది వరకు ఉన్నారని... వారికిమాత్రమే ఈ ప్రభుత్వం మంచిచేసిందన్నారు. వారిలో సజ్జలకూడా ఉన్నాడు కాబట్టి, ఆయనకు మంచి జరిగింది కాబట్టి అందరికీ మంచిజరిగిందనే భావనలో ఉన్నట్లున్నాడు అని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. 

''మున్సిపల్ శాఖామంత్రి కరపత్రం విడుదలచేసుంటే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందనుకోవచ్చు. సలహాదారు విడుదలచేయడంతో  ఈ ప్రభుత్వం చేసిందనుకుంటున్న మంచే ఎవరికి జరిగిందో ప్రజలకు అర్థమవుతోంది.  రామకృష్ణారెడ్డి విడుదలచేసిన కరపత్రం చూశాక అబద్ధంకూడా సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏదైనామంచి అనేది ప్రజలకు చేసుంటే, అందుకు సంబంధించిన జీవోలు, లెక్క లు, ఆధారాలు వాస్తవంలో కనిపించాలి. ప్రభుత్వలెక్కలు ఒకలా, ఆధారాలు మరోలా, సజ్జల విడుదలచేసిన కరపత్రంలో సమాచారం ఇంకోలా ఉంటే ఆ సమాచారం అబద్ధంకాక ఏమవుతుంది. ఇదివరకు ఒకసారి ఇలానే అబద్ధాలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారు. ప్రతిసారీ అలానే వారిని మోసగించాలనుకుంటే కుదరదు'' అని అన్నారు.

''చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లను రూ.3వేలకు పెంచుతానన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతపెంచాడో ప్రజలకు తెలియదా? రూ.1000ని నాలుగుభాగాలు చేస్తే, ఏంచెప్పినా జనం నమ్మేస్తారనుకుంటున్నారా? రాష్ట్రంలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారు అనేప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వమే మే 2019కి ముందు 54లక్షల02వేల796ఇచ్చారని సమాధానంచెప్పింది. ఇప్పుడు మొత్తంఇస్తున్న పింఛన్లు ఎన్నిఅంటే 57లక్షల93వేల25 మాత్రమే.  అంటే జగన్ ప్రభుత్వం వచ్చాక కేవలం 3లక్షల93వేల పింఛన్లు మాత్రమే పెంచింది. ఇప్పుడు విడుదలచేసిన కరపత్రంలోనేమో లంచాలిస్తే 54లక్షలమందికి ఆనాటిప్రభుత్వం పింఛన్లు ఇచ్చిందని చెప్పారు. అలాచెప్పడానికి సిగ్గుందా? 54లక్షలమంది  లంచాలిస్తే పింఛన్లు ఇచ్చినట్లయితే, ఇప్పుడు వైసీపీప్రభుత్వంకూడా 3లక్షల93వేలపింఛన్లు లంచాలిచ్చిన వారికే ఇస్తోందా? అక్టోబర్ 2018నాటికి రాష్ట్రంలో కేవలం 44లక్షలపింఛన్లే ఇచ్చారని కరపత్రం లోచెప్పి, అసెంబ్లీలో చెప్పిన సమాధానంలోనేమో 54లక్షలనిచెప్పా రు. అంటే దాదాపు10లక్షల పింఛన్లను తక్కువచేసి, కరపత్రంలో ఎక్కువగా చూపించి ప్రజలను మోసగించాలని చూస్తున్నారా?'' అని ప్రశ్నించారు.

''దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినవారు ఇప్పుడు కరపత్రంలో ఏంచెప్పారు? మద్యం దుకాణాలను తగ్గించకుండా జాతీయ హైవేల పక్కనున్న షాపులను తీసేసినట్లుగా చూపించి... కొత్త పాలసీతో ఈప్రభుత్వమే వ్యాపారం ప్రారంభించింది. జాతీయ రహాదారుల పక్కన వ్యాపారం లేదని షాపులు తీసేస్తే, వాటిని తామే తొలగించినట్లుగా ప్రభుత్వం చెప్పుకుంది. అవితీసేసినా కూడా ఈ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలతో సంవత్సరానికి రూ.15 నుంచి రూ.18 వేలకోట్ల వరకు ఆదాయం వస్తోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో జీఎస్టీ పన్నులతర్వాత, మద్యంపైనే ఎక్కువ ఆదాయం వస్తోంది. దుకాణాలు తీసేస్తే,ఆదాయం ఎలా పెరుగుతుంది. ఈవ్యవహారం గురించి కరపత్రాల్లో చెప్పకుండా, మద్యపాన నిషేధం చేశామని నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటారు? మద్యంతాగేవారి దగ్గరకువెళ్లి సజ్జలగానీ, ఎక్సైజ్ శాఖామంత్రిగానీ మద్యం దుకాణాలు తీసేశామని చెబితే వారు మందు సీసాలతో ప్రభుత్వపెద్దలను కొట్టడంఖాయం. మద్య నిషేధంఅని చెప్పి సొంతబ్రాండ్లను అధికధరకు అమ్ముతూ, మందు బాబులను దోచుకుంటున్నారు. పింఛన్లపై తప్పుడు సమాచారం ఇచ్చారు. మద్యం వ్యాపారంపై అబద్ధాలు చెబుతున్నారు. అదేనా మీరు ప్రజలకు చేసినమంచి?'' అని ప్రశ్నించారు. 

read more   టీడీపీ అభ్యర్ధి సంతకం ఫోర్జరీ.. తిరుపతి ఏడో డివిజన్‌లో ఎన్నిక రద్దు

''నాడు-నేడు గురించి చెప్పారు. బుద్ధిఉన్నవాడు ఎవడైనా  పాఠశాలల్లో ప్రమాణాలు ఎలా పెంచాలి... విద్యార్థులకు సౌకర్యాలు ఎలా కల్పించాలని ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వమేమో అవసరం లేకపోయినా సరే సున్నాలువేయండి, మరుగుదొడ్లు కట్టండి, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను దుర్వినియోగంచేయండి అని చెబుతోంది. అనుభవం లేకపోయినా ఉపాధ్యాయులతో బలవంతగా పనులుచేయించారు. అమ్మఒడి పథకం కింద రూ.15వేలు ఇస్తామన్నారు. రెండోఏడాది మరుగుదొడ్ల నిర్వహణపేరుతో రూ.1000కోతపెట్టారు. తొలిఏడాది ఎందరు విద్యార్థులకుఇచ్చారు...రెండో ఏడాది ఎంతమందికి ఇచ్చారో చెప్పండి. రెండోఏడాది విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది. 44.48లక్షలమంది తల్లులకు అమ్మఒడి ఇచ్చామన్నారు. 44.48మంది నుంచి రూ.1000చొప్పున వసూలుచేస్తే, దాదాపు రూ.444కోట్లవరకు అవుతోంది. అంతమొత్తం మరుగుదొడ్ల నిర్వహ ణకు ఖర్చు అవుతుందా? నాడు-నేడు నిధులను కాజేయడంకోసం,  విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలతో పనిలేకుండా, ప్రధానోపాధ్యాయులను ఒత్తిడి చేసి, బిల్లులు చేయించుకున్నారు. ఈ విధంగా దాదా పు 50శాతం నిధులను వైసీపీ తాబేదారులే మింగేశారు. ఈ రకంగా జరిగిన అవినీతిని కప్పిపుచ్చి, మేము నాడు-నేడు కింద పాఠశాల లు బాగుచేశామనిచెప్పుకుంటే ఎలా? నాడు-నేడు పథకంలో జరిగి న అవినీతి బయటకురావాలంటే ప్రభుత్వం తక్షణమే సీబీఐతో విచా రణ జరిపించాలి. అలా జరిపించే ధైర్యం ప్రభుత్వానికి, సలహాదారు సజ్జలకు ఉందా?'' అని సవాల్ విసిరారు. 

''జనవరి 2019నుంచి చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లను రూ.2వేలకుపెంచితే దాన్ని ఒప్పుకోరు. అమ్మఒడి కింద రూ.15వేలిస్తామని చెప్పిరూ.14వేలే ఇచ్చామని మాత్రం ఒప్పుకోరు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగభృతిని రద్దుచేశారు. అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లకింద 4లక్షల మందిని నియమించారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నా రు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుంటే, వారు ఎవరు? పార్టీ కార్యకర్తలను  ఉద్యోగాల్లో నియమించి, వారికి ప్రభుత్వ సొమ్ము కట్టబెడుతూ, పార్టీ పనులకు వాడుకుంటున్నారు. ఇంతకంటే దోపిడీ ఇంకోటి ఉంటుందా? దేశంలో ఎక్కడా ఇలాంటి మాయ చూడలేదు. 2లక్షల40వేల మంది వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వజీతాలిస్తూ, వారితో చేయకూడని పనులు చేయిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా. ప్రభుత్వమిచ్చే రూ.5వేలతో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందా? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, ఇన్నిలక్షల ఉద్యోగాలు ఇచ్చామని కరపత్రంలో ఎలా చెప్పుకుంటారు'' అని అడిగారు. 

''వివిధ శాఖల్లో లక్షకుపైగా ఖాళీలుంటే వాటిభర్తీకి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వరు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని ముఖ్యమంత్రి లేఖ రాస్తే సజ్జల రామకృష్ణారెడ్డేమో కరపత్రంలో 4లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పుకుంటున్నారు. ప్రజలను ఎలా మోసగించాలో వైసీపీ ప్రభు త్వంలోని సలహాదారులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో'' అంటూ సెటైర్లు విసిరారు. 

''వాహనమిత్ర పేరుతో ఆటోడ్రైవర్లకు రూ.10వేలిచ్చామన్నారు. రాష్ట్రంలో దాదాపు 8లక్షల ఆటోలు ఉంటే లక్షా 50వేలమందికి ఇచ్చారు. ఆసొమ్ముకు రెండింతల సొమ్ముని జరిమానాల రూపంలో ఆర్టీవో అధికారుల సాయంతో తిరిగి వసూలుచేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ –డీజిల్ ధరలు పెంచారు. అమ్మఒడి కింద రూ.14వేలిచ్చి నాన్న బుడ్డిరూపంలో అంతకు రెండింతలు మద్యం దుకాణాల నుంచి రాబట్టారు. ఇళ్లపట్టాలపేరుతో భారీస్కామ్ కు పాల్పడ్డారు. సెంటు స్థలమిచ్చి, దానికోసం రూ.8వేలకోట్ల వరకు దోపిడీచేశారు. అంతటితో ఆగకుండా రాబోయేరోజుల్లో ఇళ్లనిర్మాణం పేరుతో మరోదోపిడీకి తెరలేపబోతున్నారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

''సజ్జల విడుదల చేసిన కరపత్రంలో ఒక్కటైనా వాస్తవమని ఆయన నిరూపించాలి. కరపత్రంలోని సమాచారంపై తాము చర్చకు సిద్ధం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ప్రతిపక్షం మేనిఫోస్టో ఇచ్చింది తప్ప, ఎక్కడా కరపత్రాలు ఇవ్వలేదు. ఇన్ని అబద్ధాలు, దుర్మార్గాలతో ఎంతకాలం ప్రజలను మోసగిస్తారు. తప్పులు, మోసాల లెక్క పూర్తయ్యాక ప్రభుత్వాన్ని కాపాడటం ఎవరి తరంకాదు. రాజకీయ పండితులు, మేథావులే వైసీపీ ప్రభుత్వ అబద్ధాలు, దుర్మార్గాలపై ఆశ్చర్యపోతున్నారు. ఇన్నిఅబద్ధాలతో కరపత్రం విడుదల చేసినందుకు సజ్జల ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి తప్పుచేశానని ఒప్పుకోవాలి'' అని అశోక్ బాబు డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu