ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ముందా.. మాజీ సీఎం జగన్‌కు యనమల సవాల్

Published : Jul 10, 2024, 12:58 PM ISTUpdated : Jul 10, 2024, 01:14 PM IST
ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ముందా.. మాజీ సీఎం జగన్‌కు యనమల సవాల్

సారాంశం

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు 2014లో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. సంపద సృష్టిస్తూనే మెరుగైన సంక్షేమ పథకాలు అందించారు.రాష్ట్రానికి స్వదేశీ- విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఒక వైపు రాష్ట్ర రాజధానిని నిర్మిస్తూనే అన్ని రంగాల అభివీద్ధికి కృషి చేశారు. 

వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో పంటల సాగు పాతాళానికి పడిపోయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ హయాంలో 12.85 శాతం నుంచి 6.14 శాతానికి వ్యవసాయ రంగం పడిపోయింని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో పంట ఉత్పత్తులు లేక అప్పుల బాధతో రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్స్య, ఆక్వా రంగం బలైపోయిందన్నారు. టీడీపీ హయాంలో 2లక్షల హెక్టార్లకు ఆక్వా సాగు పెంచి... ఎగుమతులలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపామని గుర్తుచేశారు. నాడు రాష్ట్రానికి ఏటా రూ.66వేల కోట్ల జీవీఏ అందించగా.. నేడు సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పైగా ఆక్వా సాగు ఖర్చు రెండు రెట్లు పెరిగి... మద్దతు ధర లభించని పరిస్థితి నెలకొందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయన్న యనమల... జగన్‌కు ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ముందా అని సవాల్‌ విసిరారు.

యనమల ఇంకా ఏమన్నారటే...
‘‘జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు వల్ల కుదేలైన అత్యంత కీలకమైన రంగం పారిశ్రామిక రంగం. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంక్కారు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న కంపెనీలు సైతం మూతపడ్డాయి. రాష్ట్ర నిరుద్యోగిత శాతం దేశ నిరుద్యోగిత శాతం కంటే ఎక్కువగా ఉంది.
నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్టుబడుదారులు క్యూ కట్టగా అదే స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. ఎక్కువ శాతం విదేశీయులు మన రాష్ట్రంలో పర్యటించేవారు. తద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువ అవ్వడంతో పాటుగా ఉపాధి లభించేది. 2019 తర్వాత పర్యాటకరంగాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేయడంతో 9.49 శాతం నుండి 5.08 శాతానికి పడిపోయింది.
వైసీపీ నిర్వహణ లోపంతో ప్రభుత్వాసుపత్రులను నరక కూపాలుగా మార్చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేయడంతో పేదలకు ఉచిత వైద్యం దూరమైంది. రాష్ట్రంలో నుంచి ఐటీ కంపెనీలు పరారయ్యాయి. ప్రజలపై విద్యుత్ భారం మోపారు. ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించారు. విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించారు. దీంతో 6.6 శాతం నుంచి 4.53 శాతానికి పడిపోయింది.
విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు 2014లో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. సంపద సృష్టిస్తూనే మెరుగైన సంక్షేమ పథకాలు అందించారు.రాష్ట్రానికి స్వదేశీ- విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఒక వైపు రాష్ట్ర రాజధానిని నిర్మిస్తూనే అన్ని రంగాల అభివీద్ధికి కృషి చేశారు. దాని ఫలితమే 8.98 స్థూల దేశీయోత్పత్తిని సాధించాం. 2019 నుంచి సమీకరణాలు మారాయి. వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఐదేళ్లు రాజధానే లేకుండా పరిపాలించడంతో పాటు అన్ని రంగాలను కుదిపేశారు. దీంతో స్థూల దేశీయోత్పత్తి 4.46 శాతానికి పడిపోయింది’’ అని యనమల తెలిపారు.
‘‘అభివృద్ధి విధ్వంసకర విధానాలకు నిదర్శనంగా వాటిని గమనించిన ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారన్నారు. ఏమీ చేయకుండానే అన్ని చేశామని గప్పాలు చెప్పుకున్నవారి తల రాతలను ప్రజలు తిరగరాశారన్నారు. ఇకనైనా సమాజ సేవలో కలసిపోవాలని హితవు పలికారు.

ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23 ఆధారంగా సంక్షోభంలో ఉన్న ఏపీ ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని కింది పట్టిక చూపిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ స్థూల దేశీయోత్పత్తి (ప్రస్తుత ధరలు 2011-2012)

          రంగం           టీడీపీ 4ఏళ్ల సగటు      వైసీపీ 4ఏళ్ల సగటు వ్యత్యాసం
వ్యవసాయం    12.856.14-6.65
 
లైవ్ స్టాక్    12.99    5-7.98
మత్య్స & ఆక్వా 28.9    9.22    -19.67
వ్యవసాయ రంగం11.2    6.08    -5.12
తయారీ రంగం 10.02    4.61    -5.4
పారిశ్రామిక రంగం8.03    4.93    -3.1
పర్యాటకం, హోటల్లు, రెస్టారెంట్లు9.49    5.08    -4.4
సేవా రంగం6.6    4.53    -2.07
స్థూల దేశీయోత్పత్తి8.98    4.86  -4.12

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu