YS Sharmila: 10 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీ నేరవేర్చలే.. ప్రధాని మోదీకి  వైఎస్ షర్మిల లేఖ.. 

By Rajesh Karampoori  |  First Published Jan 31, 2024, 2:39 AM IST

YS Sharmila: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి 10 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేంద్రంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi)కి  వైఎస్ షర్మిల మంగళవారం నాడు లేఖ రాశారు. 


YS Sharmila: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన అనేక అపరిష్కృత హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధినేత్రి వైఎస్‌ షర్మిల మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును జాతీయ నీటిపారుదల ప్రాజెక్టుగా ప్రకటించడం, కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం వంటి ఎనిమిది హామీలను ఏపీసీసీ అధ్యక్షుడు లేఖలో పేర్కొన్నారు.  నేడు రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందన్నారు. ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని షర్మిల నిలదీశారు. 

2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి ప్రస్తావించిన షర్మిల.. విభజిత రాష్ట్ర స్వభావాన్ని వివరిస్తూ..  అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే నెరవేర్చని హామీలను పరిష్కరించాలని షర్మిల పట్టుబట్టారు. ఈ తరుణంలో AP పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో చేసిన వాగ్దానాలను పేర్కొంటూ..  5.5 కోట్ల మంది ఆంధ్రుల తరపున  తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. జనవరి 31, 2024న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్రపతి ప్రసంగంలో అంశాలను పొందుపరచాలని ఆమె లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వాల ఉదాసీనత వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిజాయితీ కూడా ప్రశ్నార్థకంగా మారిందని  ఆమె పేర్కొన్నారు.  జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాలను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున షర్మిల మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు. 

click me!