TDP Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నట్టు సమాచారం. పలు కీలక పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు భేటీ కావడంపై చర్చనీయంగా మారింది.
TDP Janasena : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ సింగల్ గా బరిలో దిగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ- జనసేనలు మాత్రం ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. కానీ.. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకాలపై మాత్రం క్లారటీ రాలేదు. ఈ తరుణంలో ఆ పొత్తుల లెక్కలను ఓ కొలిక్కి వచ్చేందుకు ఇరుపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు ( బుధవారం) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్వహిస్తున్న "రా... కదలిరా" అనే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అమరావతి పర్యాటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు సమావేశమై సీట్ల పంపకాలపై వర్కవుట్ చేయనున్నారని సమాచారం. ఆ బేటీ అనంతరం తొలుత జాబితాను విడుదల చేసేందుకు టీడీపీ- జనసేన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను ఎలా సర్దుబాటు చేస్తారో అనే విషయంపై కూడా ఓ క్లారిటీ రానున్నట్టు టాక్. కాగా.. సీట్ల కేటాయింపు విషయంలో జనసేనాని కాస్త సర్దుకుపోయే ధోరణితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త తగ్గనట్టు.. పవన్ కళ్యాన్ కేవలం 25 నుంచి 30 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే 2 నుంచి 4 ఎంపీ సీట్లను మాత్రమే ఆశిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు.. చంద్రబాబు- పవన్ కల్యాణ్ లకు సీట్ల కేటాయింపులో వివాదం చెలారేగినట్టు తెలుస్తోంది. ఇరుపార్టీల మధ్య పొత్తులో ఉన్నట్టు బాహాటంగా ప్రకటించినా.. మండపేట, అరకు స్థానాలను చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన జనసేనాని పవన్ ఆ ప్రకటనకు కౌంటర్ గా రెండు సీట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని పాటించలేదనీ, దీంతో తాము కూడా అదే బాటలో నడిచామని జనసేనాని తెలిపారు. ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీతో ఇరు పార్టీల పొత్తుతో పాటు సీట్లు సర్దుబాటుపై ఓ క్లారిటీ వచ్చే అవగాహన ఉంది.