ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు ఆందోళనకు దిగాయి.
అమరావతి:ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్భంధించారు. ఈ ఘటనలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు గురువారంనాడు వై.ఎస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
also read:విశాఖలో మిలన్ 2024: 50 దేశాల నేవీ బృందాల విన్యాసాలు
undefined
నిన్న రాత్రి నుండి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. మెగా డిఎస్‌సీని ప్రకటించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఇవాళ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
also read:పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు: ఎంత పవరో తెలుసా?
రాష్ట్రంలో డిఎస్‌సీ ద్వారా ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. రాష్ట్రంలోని 23 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
APCC President Smt. garu leads the protest against unemployment and unkept promises of the government.
She was scheduled to lead the 'Chalo Secretariat' march. But the police are restricting the march and not allowing the leaders and karyakartas… pic.twitter.com/IszRvCQdIR
తనను చూసి జగన్ సర్కార్ భయపడుతుందని షర్మిల విమర్శించారు.ఛలో సెక్రటేరియట్ నిర్వహించకుండా జగన్ ప్రభుత్వం వందల సంఖ్యలో పోలీసులను మోహరించారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్‌సీ పోస్టుల భర్తీ విషయమై జగన్ విమర్శలు చేసినట్టుగా ఆమె గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడ అదే పనిచేస్తున్నాడన్నారు.మెగా డీఎస్‌సీ నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నా కూడ ఎందుకు మెగా డీఎస్‌సీని నిర్వహించడం లేదని ఆమె ప్రశ్నించారు.ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకొన్నారన్నారు. మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏముందని షర్మిల ప్రశ్నించారు.