పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు: ఎంత పవరో తెలుసా?

By narsimha lodeFirst Published Feb 22, 2024, 8:53 AM IST
Highlights


జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కొత్తగా రెండు ఉంగరాలు ధరించాడు.ఈ రెండు ఉంగరాలు ధరించడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది.


హైదరాబాద్:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుడి చేతికి రెండు ఉంగరాలపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఒకటి నాగప్రతిమ, మరోటి తాబేలు ప్రతిమతో ఉన్న ఉంగరాలను  పవన్ కళ్యాణ్ ధరించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్  జాతక రీత్యా  ఈ ఉంగరాలను ధరించి ఉండొచ్చని  జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ జాతక రీత్యా ఈ ఉంగరాలను ధరించాడని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

1971 సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ జన్మించాడు.  పవన్ కళ్యాణ్ జాతక రీత్యా చంద్ర మంగళ యోగం ఉంది. అయితే కుజ, రాహు సంధి ప్రభావం కారణంగా నాగబంధం  ఉన్న ఉంగరం ధరించడం  పవన్ కళ్యాణ్ కు కలిసి రానుందని  ఓ జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.తాబేలు రూపంలో ఉన్న ఉంగరం  ప్రజాకర్షణకు, ఎదుగుదల, అధికారానికి దోహదం చేస్తుందని  జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

also read:పార్లమెంట్ ఎన్నికలు:తెలంగాణలో వలసలపై బీజేపీ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  త్వరలోనే  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  తెలుగు దేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి.ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతున్నాయి.  మరో వైపు ఈ కూటమిలో  బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే  చర్చ కూడ సాగుతుంది.

విశాఖ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలోని  జనసేన కార్యకర్తలు, నేతలతో పవన్ కళ్యాణ్  వరుస సమావేశాలు నిర్వహించారు.  ఆయా జిల్లాల్లో  ఏఏ స్థానాల్లో పోటీ చేసే విషయమై  పార్టీ నేతలకు  స్పష్టత ఇచ్చారు.  ఏలూరు జిల్లాలోని  భీమవరం అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేయాలని పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో కూడ ఇదే స్థానం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పవన్ కళ్యాణ్ ఇదే స్థానం నుండి పోటీ చేయనున్నారు.  ఈ నెల  21న పార్టీ నేతలకు  ఈ విషయమై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీని గద్దె దించాలనే లక్ష్యంతోనే పనిచేస్తామని  పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్టుగా  జనసేన ప్రకటించింది.

 


 

click me!