సీఎంఓకు క్యూ: వైఎస్ఆర్‌సీపీ మూడో జాబితాపై జగన్ కసరత్తు

By narsimha lode  |  First Published Jan 10, 2024, 12:01 PM IST


సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో  మార్పులు, చేర్పులపై  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  కసరత్తు చేస్తున్నారు. మూడో జాబితాపై  కసరత్తు దాదాపుగా  పూర్తి కావచ్చిందని చెబుతున్నారు.


అమరావతి: సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పుల విషయంలో  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  ఈ  ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ పావులు వ్యూహారచన చేస్తుంది.  వైనాట్  175 అనే నినాదంతో  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ముందుకు  సాగుతుంది.ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను అభ్యర్ధులను నిలపాలని  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Latest Videos

undefined

ఈ క్రమంలోనే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పులు చేర్పులకు  జగన్ శ్రీకారం చుట్టారు. తొలి విడతలో  11 అసెంబ్లీ స్థానాల్లో  ఇంచార్జీలను మార్చారు.  రెండో విడతలో  27 మంది ఇంచార్జీలను మార్చారు.  ఇక మూడో జాబితాపై  కసరత్తు చేస్తున్నారు. మూడో విడతలో  కనీసం  29 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.  మూడో జాబితా కసరత్తుపై  జగన్ కసరత్తు ఇంకా కొనసాగుతుంది. 

బుధవారం నాడు  ఉదయమే  తాడేపల్లిలోని  సీఎంఓకు   ఎమ్మెల్యేలు  జక్కంపూడి రాజా, పేర్నినాని, కరణం ధర్మశ్రీ వచ్చారు.  ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు  సీఎంఓకు మంత్రి గుమ్మనూరు జయరాం రానున్నారు. గుమ్మనూరు జయరాం ను వచ్చే ఎన్నికల్లో  ఆలూరు నుండి కాకుండా కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలని  వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ప్రతిపాదిస్తుంది. అయితే  ఆలూరు నుండి పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతుంది. ఆలూరు  నుండి గుమ్మనూరు జయరాం ను తప్పించి విరూపాక్షిని బరిలోకి దింపే ఆలోచనలో  జగన్ ఉన్నారు.  

also read:తుంటి విరిగిందా: రేవంత్ రెడ్డికి కొడాలి నాని కౌంటర్

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని  అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి  మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే అనకాపల్లి నుండి గుడివాడ అమర్ నాథ్ ను తప్పించారు. అమర్ నాథ్ కు  జిల్లాలోని మరో స్థానం నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం  ప్రతిపాదిస్తుంది.ఈ విషయమై  గుడివాడ అమర్ నాథ్ కు పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వనుంది.  ఇవాళ మధ్యాహ్నం గుడివాడ అమర్ నాథ్ సీఎంఓకు రానున్నారు.  ఏ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలనే విషయమై  మంత్రి అమర్ నాథ్ కు  జగన్  స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

also read:బోగస్ ఓట్లపై టీడీపీ తప్పుడు ఫిర్యాదు: చర్యలు తీసుకోవాలని కోరామన్న విజయసాయి రెడ్డి

విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఈ స్థానాన్ని కేటాయించారు. అయితే మల్లాది విష్ణు  సహకారం లేకుండా ఈ స్థానంలో తనకు ఇబ్బందులు ఎదురౌతాయని వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ దృష్టికి తెచ్చారు.  వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులను పిలిపించి వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం చర్చించింది. మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే ,మాజీ మంత్రి పార్థసారథితో పార్టీ నేతలు  వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్థసారథి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. 

వచ్చే ఎన్నికల్లో  పార్టీ టిక్కెట్టు లేదని తేల్చి చెప్పడంతో  విజయవాడ ఎంపీ కేశినేని నాని  వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. దీంతో  కేశినేని నాని  ఇవాళ  మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ అవుతారని  చెబుతున్నారు.  

click me!