వైసీపీలో చేరబోతున్న కేశినేని నాని?

Published : Jan 10, 2024, 11:15 AM ISTUpdated : Jan 10, 2024, 01:00 PM IST
వైసీపీలో చేరబోతున్న కేశినేని నాని?

సారాంశం

టీడీపీ కేశినేని నానిని పక్కన పెట్టడంతో పార్టీకి రాజీనామా చేశారు నాని.. ఈ క్రమంలోనే వైపీపీలో చేరతారని తెలుస్తోంది. 

విజయవాడ : విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీనుంచి బైటికి వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరబోతున్నారని  సమాచారం. ఈ మేరకు బుధవారం వైఎస్ జగన్ తో సమావేశం కాబోతున్నారు. టీడీపీ కేశినేని నానిని పక్కన పెట్టడంతో పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.. ఈ క్రమంలోనే వైపీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో నాని చర్చలు జరిపారు. నాని వైసీపీలో చేరే అంశంపై బుధవారం సాయంత్రానికి ఓ స్పష్టత రానుంది. 

ఇదిలా ఉండగా, సిట్టింగ్ ఎంపీ కేశినేని నానీకి టిడిపి హై కమాండ్ షాక్ ఇచ్చింది. విజయవాడ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడంలేదని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. విజయవాడ ఎంపీ టికెట్ ను వేరేవారికి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమంలో కలగజేసుకోవద్దని చెప్పారని.. దీంతో తాను పోటీనుంచి తప్పుకుంటున్నానని కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అధినేత ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని నాని తెలిపారు. చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరిస్తూ తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ట్వీట్ చేశారు. 

ఈనెల 7వ తేదీని తిరువూరులో జరిగే సభ ఏర్పాట్ల బాధ్యత కూడా కేశినేని చిన్నీకే అప్పగించారు. ఈ విషయంలో కలగజేసుకోవద్దని అధిష్టానం సమాచారం ఇచ్చింది. దీంతో అన్నాదమ్ముల మధ్య జరిగిన పోరుకు పుల్ స్టాప్ పడినట్టైంది. దీనిమీద కేశినేని చిన్నీ మాట్లాడుతూ.. తాను పార్టీ కార్యకర్తనని.. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఇటీవల తిరువూరు కేంద్రంగా కేశినేని నాని, కేశినేని చిన్నీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. 

తనకు టికెట్ ఇచ్చే విషయం సమాచారం లేదని అన్నారు. కేశినేని నానీతో గొడవలు సద్దుమణిగినట్టేనా అని అడిగిన ప్రశ్నకు అవి పెద్ద గొడవలు కావని.. అన్నిచోట్లా ఉండేవేనని.. వాటిని మరీ ఎక్కువ చేసి చూపించారని చెప్పినట్లు ఎన్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. పార్టీలో ఎవరైనా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికే పనిచేస్తారని.. తామూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికే పనిచేస్తున్నామని, అంతిమ లక్ష్యం అదే అన్నారు. ఆ తరువాతి రోజే ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లి స్పీకర్ కు రాజీనామా సమర్పిస్తానన్నారు. ఆ తరువాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. కానీ ఢిల్లీకి వెళ్లకుండానే నాని కూతురు శ్వేత టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ తో సమావేశం కాబోతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PSLV-C62 EOS-N1 Launch: ఇస్రో ప్రయోగంపై సైంటిస్టులు, స్టూడెంట్స్ రియాక్షన్ | Asianet News Telugu
Minister Satya Kumar Yadav Highlights Importance of Blood Donation | BloodCamp | Asianet News Telugu