కేశినేని నాని : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Published : Mar 17, 2024, 02:21 AM IST
కేశినేని నాని : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

సారాంశం

Kesineni Nani: శ్రీనివాస్ కేశినేని.. నానిగా సుప‌రిచితం. ఆయన ప్ర‌ఖ్యాత‌ వ్యాపార‌వేత్త , రాజకీయ‌వేత్త‌. గత రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా విజయవాడ ఎంపీగా గెలుపొందిన ఆయన ప్రస్తుతం వైసీపీ నుంచి విజ‌య‌వాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కేశినేని నాని వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం.

Kesineni Nani Biography: 

బాల్యం, వ్యక్తిగత జీవితం

కేశినేని నాని అసలు పేరు కేశినేని శ్రీనివాస్. ఆయన 1966 జనవరి 22న కేశినేని రామస్వామి, ప్రసూనాంబ దంపతులకు జన్మించారు. విజయవాడలోనే పుట్టి పెరిగాడు.కేశినేని నాని తాత వెంకయ్య 1928లోనే కేశినేని ట్రావెల్స్‌ను ప్రారంభించారు.
 

ఆయన రాజకీయాల్లోకి రాక ముందు కేశినేని నాని తమ కుటుంబ వ్యాపారాన్ని చూసుకున్నారు. తన వ్యాపారాన్ని ట్రావెల్ బస్సులు, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో విస్తరించారు. రాజకీయాల్లోకి రాక ముందే తన వ్యాపారాల ద్వారా ఎంతో మంది ప్రజలకు లబ్ధి చేకూర్చారు. వందల కోట్ల విలువైన భూమిని విరాళంగా  ఇచ్చారు. 1992లో పావనిని పెళ్లాడారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.   

 రాజకీయ జీవితం 

>> 2008లో చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో నాని చేరారు. ఆ పార్టీలో ఆయన కేవ‌లం 3 నెల‌లు మాత్ర‌మే కొన‌సాగారు.

>> 2009లో ప్రజా రాజ్యం పార్టీకి రాజీనామా చేసి  తెలుగుదేశం పార్టీలో చేరారు.

>> 2013 జ‌న‌వ‌రిలో లోక్‌స‌భ ఎన్నిక‌ల అభ్య‌ర్థిగా నాని పేరును టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిపాదించారు. పూర్తి నిబ‌ద్ధ‌త‌తో కృషి చేసిన త‌ర్వాత, ఎట్ట‌కేల‌కు ఆయ‌న విజ‌య‌వాడ టికెట్‌ను ద‌క్కించుకున్నారు. 

>> ఈ ఎన్నికల్లో విజ‌య‌వాడ నుంచి 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. నాని తన ప్ర‌త్య‌ర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేరు రాజేంద్ర ప్ర‌సాద్ పై 517834 ఓట్ల తేడాతో గెలుపొందారు.

>> 2014లో  ప్రివిలేజేస్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితులయ్యారు. ఇదే ఏడాది ప‌ట్ట‌ణాభివృద్ధి స్టాండింగ్ క‌మిటీ, కాన్సులేటివ్ క‌మిటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌, పంచాయ‌తీ రాజ్, త్రాగునీరు మ‌రియు పారిశుద్ధ్యం స్టాండింగ్ క‌మిటీలలో స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
 
>> 2019 సాధారణ ఎన్నికలలో తిరిగి విజ‌య‌వాడ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు.  
 
>> టీడీపీలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన 2024 జనవరి 10న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. 

>> ఆ తరువాత వైసీపీలో చేరారు.  ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ తరుపున మరో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచారు. 

రాజకీయేతర జీవితం

>> కేశినేని ట్రావెల్స్ ను కేశినేని నాని తాత కేశినేని వెంకయ్య 1928 లో ప్రారంభించాడు. అది 90 సంవత్సరాల నుండి వారసత్వంగా నడుపుచున్న కేశినేని ట్రావెల్స్ ను 2018 మార్చి 31న మూసివేశారు.

కేశినేని శ్రీనివాస్  బయో 

పూర్తి పేరు:  కేశినేని శ్రీనివాస్( కేశినేనినాని)
పుట్టిన తేదీ: 22 Jan 1966
జన్మ స్థలం: విజ‌య‌వాడ‌, కృష్ణా జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్
పార్టీ పేరు    : వైసీపీ  
విద్య: 10th Pass
వృత్తి: వ్యాపార‌వేత్త‌, రాజకీయ నాయకుడు
తండ్రి: స్వ‌ర్గీయ శ్రీ కేశినేని రామ‌స్వామి కేశినేని
తల్లి:  కేశినేని ప్ర‌సూనాంబ 
జీవిత భాగస్వామి : పావ‌ని కేశినేని
శాశ్వత చిరునామా: కేశినేని భ‌వ‌న్‌, పిన్న‌ల‌వారి వీధి, విజ‌య‌వాడ‌-520002,  
ఈ-మెయిల్:     kesineni.srinivas@sansad.nic.in

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్