
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత క్యాబినెట్ వియ్యంకులిద్దరు గాలిలో తేలిపోతున్నారు.
పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో నెల్లూరు జిల్లాలో టిడిపి అభ్యర్థి వాకాటి విజయం, హెచ్ ఆర్ డి మంత్రి గంటా పర్యవేక్షణలో కడప జిల్లాలో పార్టీ అభ్యర్థి బిటెక్ రవి గెలుపు తర్వాత వీరిద్దరిని టిడిపి ఎమ్మెల్యేలు కార్యసాధకుల్లాగా చూస్తున్నారు. ఆకాశానికెత్తున్నారు. ఇది కొంచెం వోవర్ సాగుతున్నట్లుంది. డబ్బున్న అసాములయిన వియ్యంకులు ఇలా పాపులర్ కావడం టిడిపిలో ఎంతమందికి నచ్చుతుందో చూడాలి.
దీనికి తోడు గంటా శ్రీనివాసరావు కొంచెం స్వయానా మరీ ఎక్కువగా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కారణం, తాను ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్న కడప జిల్లా కౌన్సిల్ ఎన్నికకు కొత్త ట్విస్టు ఉండటమే. తాను జెయింట్ కిల్లర్ అని సంబరపడుతున్నారు. కడప ఎన్నిక లో టిడిపి అభ్యర్థి గెలుపొండానే దానికంటే, వైసిసి అభ్యర్థి, అందునా జగన్ కుటుంబసభ్యుని వోడించడంగా ప్రచారం చేసుకుంటున్నారు. అదిజగన్ వోటమికి తొలిమెట్టఅని గంటా భాష్యం. గంటా, నారాయణ ఇద్దరు ‘కార్యసాధకులే’. అనుమానం లేదు.అందుకే వారికి ఎన్నికల బాధ్యత అప్పగించారు.
ఫలితం వచ్చినప్పటినుంచి గంటా భూమ్మీద లేడు. మొన్న 2014లో వైజాగ్ లో విజయమ్మను వోడించాం,ఇపుడు వివేకానంద, తర్వాత 2019లో ఇక పులివెందులలో జగన్ ని వోడిస్తాం అని ప్రకటించేశాడు. దీనిని ఈ రోజు వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇంకా ముందుకు తీసుకువెళ్లారు. కడప ఎమ్మెల్సీ విజయంలో గంటా పాత్ర చాలా ఉందని, 2019 ఎన్నికల్లో వైసీపీకి పోటీగా పులివెందులలో గంటాను నిలబెడతామని ఆయన అనేశారు. ఇందులో ఎంత వ్యంగ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన మీడియా తో ఈ మాట అంటున్నపుడే అటుగో వైసిపి నాయకుడు బోత్స సత్యనారాయణ అటుగా వచ్చి, దీనికి తగిన జవాబిచ్చాడు.
‘గంటా రాజకీయాల్లో ఉండటం ఇష్టం లేనట్టుంది. అందుకే పుల్లారావు ఇలా అంటున్నాడు,‘ చురక అంటించారు. అనంతరం బొత్స, పుల్లారావు నవ్వు కుంటూ చెరొకక దారి వెళ్లి పోయారు.
ఇంతకి గంటాని ఉట్టికెక్కిస్తున్నారా, వూబిలోకి తోస్తున్నారా... గంటా, జాగ్రత్త.