జగన్‌కు షాక్: అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్‌బ్యాంక్

By Siva KodatiFirst Published Jul 19, 2019, 7:53 AM IST
Highlights

అమరావతి నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకున్నట్లుగా ప్రకటించింది. రాజధాని ప్రాంతంలోని రైతులు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

వైఎస్ జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకుంది. 300 మిలియన్ డాలర్ల రుణ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయగా.. దానిని నుంచి తప్పుకున్నట్లు వరల్డ్ బ్యాంక్ తన వెబ్‌సైట్లో పొందుపరిచింది.

అమరావతి అభివృద్ధి కోసం 715 డాలర్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించగా 300 మిలియన్ డాలర్లు మాత్రమే రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమైంది.

ఈ లోగా అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు.. రాజధాని నిర్మాణం తమ జీవనాధారానికి హని చేస్తోందని.. పర్యావరణానికి, ఆహార భద్రతకు ఇది భంగం కలిగిస్తోందంటూ వారు వరల్డ్ బ్యాంక్ తనిఖీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ప్రపంచబ్యాంక్ రుణం మంజూరు విషయంలో జాప్యం చేస్తూ వచ్చి.... చివరికి ఏకంగా ప్రాజెక్ట్ నుంచే తప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా.. అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకున్నట్లు తమకు అధికారికంగా సమాచారం అందలేదని ఏపీ సీఆర్‌డీఏ తెలిపింది. 

click me!