నేను మాట్లాడింది ఏ రోజైనా వింటేగా: అచ్చెన్నాయుడిపై అనిల్ ఫైర్

By Siva KodatiFirst Published Jul 18, 2019, 3:51 PM IST
Highlights

తాను చెప్పింది ఏ రోజైనా వింటే ప్రతిపక్షానికి డౌట్లు రావంటూ ఫైరయ్యారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు, మంత్రి అనిల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. 

చంద్రబాబు మాట్లాడినా.. తాను మాట్లాడినా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలకు సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ జరిగింది. విమర్శలను పాజిటివ్‌గా తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.

రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే లక్షలాది ఎకరాల సాగుభూమి అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చి 45 రోజులు గడుస్తున్నాయని నీటిపారుదల ప్రాజెక్టులపై జ్యూడీషియల్ కమీషన్ వేస్తామని.. రివర్స్‌టెండరింగ్‌కు వెళతామని చెబుతున్నారు కానీ దానిని అమలు పరచడం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

దీనికి అనిల్ కుమార్ కౌంటరిస్తూ.. తాను చెప్పింది వింటే ప్రతిపక్షానికి ఈ సమస్య రాదంటూ సెటైర్లు వేశారు. ఇదే అంశంపై ఆర్ధిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో సన్నిహితంగా ఉండటం ప్రతిపక్షం ఒర్చుకోలేకపోతోందన్నారు.

అచ్చెన్నాయుడు మాట్లాడిన దానిలో సబ్జెక్ట్ లేదంటూ చురకలంటించారు. తెలంగాణకు ఏపీ ఆస్తి ఏమి ఇవ్వలేదని.. అసెంబ్లీ, సచివాలయ భవనాలు మనకు ఉపయోగపడవనే ఉద్దేశ్యంతోనే వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించామని బుగ్గన స్పష్టం చేశారు.

పదేళ్ల మన ఆస్తిని కాపాడకుండా.. ఓటుకు నోటు కేసులో అమరావతికి పారిపోయి వచ్చారంటూ రాజేంద్రనాథ్ రెడ్డి సెటైర్లు వేశారు. 
 

click me!