ఇప్పుడు కైలాసానికి వెళ్లి శివుడికి నోటీసులివ్వాలా?: వినుకొండ మున్సిపల్ కమీషనర్ అనుచిత వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 16, 2021, 10:35 AM IST
Highlights

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గుంటూరు జిల్లా వినుకొండ మున్సిపల్ కమీషనర్ వ్యవహరించాారంటూ కొందరు మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

గుంటూరు: హిందువలు మనోబావాలను దెబ్బతీస్తూ దేవాలయాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసుకు ఫిర్యాదు చేశారు మహిళలు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దేవాలయాన్ని కూల్చేశారంటూ గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. 

వివరాల్లోకి వెళితే... వినుకొండ: పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో కాశీ విశ్వేశ్వర ఓంకార క్షేత్రం పేరుతో శివాలయం ఉంది. అయితే ఈ ఆలయాన్ని ఇటీవల మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఈ ఆలయ  కూల్చివేతను అడ్డుకోడానికిన స్థానికులు అడ్డుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.  దీంతో వారు స్థానిక మున్సిపల్ కమిషనర్ పై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

వీడియో

తమ అభ్యర్థనలను పట్టించుకోకుండా, హైకోర్టు ఆదేశాలు దిక్కరిస్తూ గుడిని కూల్చివేయడం ధర్మం కాదని వేడుకున్నా కమీషనర్ వినిపించుకోలేదని మహిళలు వాపోయారు. గుడి లేదు... శివ లింగం లేదు అంటూ హేళనగా మాట్లాడుతూ తన సిబ్బందితో మమ్మల్ని పక్కకు నెట్టివేయించి కూల్చివేత చేపట్టారని ఆరోపించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా దేవాలయాన్ని ఎలా కూల్చివేస్తారని అడగ్గా... అయితే ఇప్పుడు కైలాసం వెళ్లి శివుడుకి నోటీసులు ఇవ్వాలా? అంటూ మున్సిపల్ కమీషనర్ హేళనగా మాట్లాడారని మహిళలు తెలిపారు. 

read more  దేవాలయాలపై దాడులు...ఆ పాస్టర్ వెనక సీఎం బంధువులు: అయ్యన్న సంచలనం

తన సిబ్బందితో పవిత్రమైన గుడిలోకి బూట్లు, చెప్పులతో ప్రవేశించి శివుని విగ్రహన్నిపడగొట్టడమే కాదు శివలింగాన్ని ప్రోక్లైన్ తో ధ్వంసం చేయబోయారని అన్నారు. అంతలోనే మరికొందరు భక్తులు గుమిగూడటం, మీడియా వారు రావడంతో అక్కడ నుంచి తన సిబ్బందితో కమిషనర్ వెనుదిరిగి వెళ్లిపోయారన్నారు. 

దేవాలయ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి దేవాలయ ప్రాంగణ(ప్రత్యేక చట్టం) చట్టం 1991 The place worship (Special provisions) Act యొక్క నియములను పాటించకుండా శివుని విగ్రహమును ప్రోక్లైన్ తో ధ్వంసం చేసి హైకోర్టు వారి ఉత్తర్వులను భేఖాతరు చేసిన వినుకొండ మున్సిపల్ కమిషనర్ .బి.శ్రీనివాసులు, టిపివో లక్ష్మి, మున్సిపల్ కాంట్రాక్ట్ సిబ్బంది మహేంద్ర రెడ్డితో పాటు సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

click me!