విజయవాడలో మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం... మరో ఎస్సైతో ప్రేమే కారణమా?

Arun Kumar P   | Asianet News
Published : Jun 14, 2021, 04:01 PM IST
విజయవాడలో మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం... మరో ఎస్సైతో ప్రేమే కారణమా?

సారాంశం

 పోలీస్ శాఖలోనే మరో ఎస్సైతో ప్రేమాయణం కొనసాగించిన మహిళా ఎస్సై మనస్పర్థల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ: మహిళా ఎస్సై శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. తాను పనిచేసే పోలీస్ శాఖలోనే మరో ఎస్సైతో ప్రేమాయణం కొనసాగించగా...ఇటీవల ఇద్దరి మద్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇదే సదరు ఎస్సై ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళితే... విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై సీసీఎస్ లో పనిచేసే ఎస్సై ప్రేమించుకున్నారు. సదరు ఎస్సైకి మరో యువతితో ఇప్పటికే పెళ్లి అయినప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందట. అయితే అతడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని మాత్రం ఈమె తట్టుకోలేకపోయింది. దీంతో అతడిని నిలదీయడంతో ఇద్దరి మద్య విబేదాలు తలెత్తాయి.  

read more  పెళ్లయిన 20రోజులకే... నవ వధువు బలవన్మరణం... కారణమదేనా?

దీంతో  తీవ్ర మనస్థాపానికి గురయిన మహళా ఎస్సై అయోధ్య నగర్ లోని ఇంట్లో శానిటైజర్ తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు.  ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా వున్నట్లు తెలుస్తోంది. 

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఆత్మహత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళా ఎస్సై‌-సిసిఎస్ ఎస్సైల ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమా అన్న కోణంలో పోలీసుకు విచారణ సాగుతోంది. 
 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu