ప్రియుడితో సహజీవనం.. అడ్డువచ్చిన భర్త కళ్లల్లో కారం కొట్టి..

Published : May 06, 2019, 10:03 AM IST
ప్రియుడితో సహజీవనం.. అడ్డువచ్చిన భర్త కళ్లల్లో కారం కొట్టి..

సారాంశం

భర్త తనను కాదని దూరంగా ఉంటున్నాడని.. ఆమె మరో దారి వెతుక్కుంది. మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తోంది. 

భర్త తనను కాదని దూరంగా ఉంటున్నాడని.. ఆమె మరో దారి వెతుక్కుంది. మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తోంది. విషయం తెలుసుకున్న భర్త.. వారిని చంపేందుకు కత్తితో రాగా.. భర్త నుంచి ప్రియుడిని చాలా తెలివిగా కాపాడింది. ప్రియుడి కళ్లలో కారం కొట్టి.. తెలివిగా ప్రియుడితో కలిసి పరారయ్యింది. ఈ సంఘటన గుడివాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుడివాడ పట్టణం వాంబేకాలనీకి చెందిన మురళీకృష్ణ గత కొంత కాలం క్రితం భార్యతో గొడవపడి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతని భార్య గోకరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతనితోనే సహజీనం చేస్తోంది. ఈ విషయం మురళీకృష్ణకు తాజాగా తెలిసింది.

ఎంత తాను వదిలేస్తే... మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుందా అని రగలిపోయాడు. గోకరాజు తన భార్యతో ఉన్న సమయం చూసి కత్తితో వెళ్లి దాడి చేశాడు. తన భర్త దాడి నుంచి ప్రియుడ్ని రక్షించేందుకు మురళీకృష్ణ కళ్లలో కారం కొట్టింది. అతను మంటతో విలవిలలాడుతుండగా.. ప్రియుడితో అక్కడి నుంచి పరారయ్యింది.

గాయాలైన గోకరాజును చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించి... భర్తపై హత్యాయత్నం కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu