ఏపీలో రీపోలింగ్: పసుపు కండువాతో బూత్‌లోకి గల్లా జయ్‌దేవ్

By Siva KodatiFirst Published May 6, 2019, 7:43 AM IST
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తొలి విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతతో పాటు ఘర్షణలు చోటు చేసుకోవడంతో 5 కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని అటకానితిప్పలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 59.14 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం

నరసరావుపేట (కేసానుపల్లి)- 13.32%
గుంటూరు వెస్ట్ (నల్లచెరువు)- 19.87%
ఎర్రగొండపాలెం (కలనూత)- 9.53%
కోవ్వూరు (ఇసుకపాలెం)- 13.28%
సూళ్లూరుపేట (అటకానితిప్ప)- 30.47%

గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలోని నల్లచెరువు పోలింగ్ బూత్ నెంబర్ 244లో రీ పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్ పసుపు కండువా వేసుకుని రావడంపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. 

రీపోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నల్లచెరువు ప్రాంతంలో షాపులను బలవంతంగా మూసివేయిస్తున్నారు. అంతేకాకుండా ఇళ్ల నుంచి ప్రజలను బయటకు రానివ్వడం లేదు. గుంటూరు-పర్చూరు రహదారిని మూసివేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తొలి విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతతో పాటు ఘర్షణలు చోటు చేసుకోవడంతో 5 కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.

నరసారావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం,గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244 పోలింగ్ కేంద్రం, నెల్లూరు శాసనసభ నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో ఉన్న 247వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది.

దీంతో మరోసారి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

click me!