నిధి కోసం ఓ మహిళ నగ్నంగా..

Published : Oct 08, 2018, 09:54 AM IST
నిధి కోసం ఓ మహిళ నగ్నంగా..

సారాంశం

గుప్త నిధి లభిస్తుందని ఓ నకిలీ స్వామిజీ చెప్పిన మాయమాటలు నమ్మి..ఓ మహిళ మోసపోయింది. అతను చెప్పినట్లు విని.. అర్థరాత్రి పూట నగ్నంగా పూజలు చేసింది.

గుప్త నిధి లభిస్తుందని ఓ నకిలీ స్వామిజీ చెప్పిన మాయమాటలు నమ్మి..ఓ మహిళ మోసపోయింది. అతను చెప్పినట్లు విని.. అర్థరాత్రి పూట నగ్నంగా పూజలు చేసింది. ఈ సంఘటన మంత్రాలయంలోని మాధవరం గ్రామంలో చోటు చేసుకుంది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..మాధవరం గ్రామానికి చెందిన ఓ మహిళ (50) ఇంటికి తరచూ పాము వచ్చేది. ఈ విషయాన్ని రచ్చుమర్రి గ్రామానికి చెందిన వ్యక్తికి చెప్పింది. అనంతపురం జిల్లా పామిడికి చెందిన స్వామిని ఆశ్రయించడంతో ఇంటిని పరిశీలించారు. ఇంట్లో నిధి ఉందని, రాత్రి నగ్నంగా పూజలు చేస్తే దొరుకుతుందని చెప్పారు. 

ఇందుకోసం రూ.30 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ మహిళ ఓ రోజు రాత్రి ఇంటికి వచ్చిన స్వామి చెప్పిన ప్రకారం పూజలు చేశారు. పాము రావడం ఆగిపోలేదు. నిధి రాలేదు. ఆరు నెలుగా ఎదురు చూసిన మహిళ డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో స్వామి తప్పించుకు తిరిగాడు. దీంతో తమకు స్వామిని పరిచయం చేసిన వ్యక్తిని నడిరోడ్డుపై చొక్కా పట్టుకొని గొడవచేసింది. 

డబ్బులివ్వకపోతే బజారుకు ఈడ్చుతానని గొడవపడింది. వ్యక్తిని కొట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై మాధవరం ఏఎస్‌ఐ గోపాల్‌ను వివరణ కోరగా ఆరునెలల కిందట జరిగిన అంశంపై ఈ మధ్యకాలంలో డబ్బు కోసం గొడవపడ్డారని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే