చనిపోయిన తండ్రి.. నాన్న నిద్రపోతున్నాడు అనుకోని.. రాత్రంతా కారులోనే చిన్నారులు

sivanagaprasad kodati |  
Published : Oct 08, 2018, 09:23 AM IST
చనిపోయిన తండ్రి.. నాన్న నిద్రపోతున్నాడు అనుకోని.. రాత్రంతా కారులోనే చిన్నారులు

సారాంశం

భార్య మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి నిద్రపోతున్నాడుకున్న పిల్లలు మృతదేహంతో రాత్రంతా కారులోనే పడుకున్నారు.

భార్య మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి నిద్రపోతున్నాడుకున్న పిల్లలు మృతదేహంతో రాత్రంతా కారులోనే పడుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన కె.నాగరాజుకు కందకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన వీణాకుమారికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు పిల్లలు.. ఉపాధి నిమిత్తం కుటుంబంతో పాటు హైదరాబాద్ వచ్చిన నాగరాజు.. హఫీజ్‌పేటలో నివసిస్తూ బేల్తారీ మేస్త్రీగా పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో కలత చెందిన వీణాకుమారి... గత నెల 28న ఆత్మహత్య చేసుకుంది.

ఆమె అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చిన నాగరాజు.. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తాను చనిపోతే ఇద్దరు బిడ్డలు బిడ్డలు అనాథలు అవుతారని... అంతకంటే ముందే వారిని చంపాలనుకున్నాడు.. శనివారం రాత్రి కారులో పిల్లలను తీసుకుని కందుకూరు మండలంలోని పలుకూరు అడ్డరోడ్డు సమీపంలోని శానంపూడి పొలాలకు వెళ్లే దారిలోకి వచ్చి కారును ఆపాడు.

అప్పటికే తనతో తెచ్చుకున్న పురుగులమందు సేవించాడు. అనంతరం పిల్లలను చంపేందుకు టవల్‌తో వారి గొంతులకు వేసి లాగాడు.. వారు భయపడి కారులో నుంచి కిందకు దిగారు. కొంచెం సేపటి తర్వాత తండ్రి దగ్గరకు వెళ్లగా... ఆయన నిద్రిస్తూ ఉండటంతో కారులోకి ఎక్కి పడుకున్నారు.

ఆదివారం ఉదయాన్నే నిద్ర లేచిన చిన్నారులు తండ్రిని ఎంత పిలిచినా లేవకపోవడంతో.. భయపడుతూ.. రోడ్డుమీదకు వచ్చి అటుగా వెళుతున్న గ్రామస్తుల సాయంతో బంధువులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో చిన్నారులు అనాథలుగా మిగిలారు. 

భార్యపై అనుమానంతో.. కొడుకును నీటి తొట్టెలో వేసి, కూతురు గొంతు కోసి.. తండ్రి దారుణహత్య

PREV
click me!

Recommended Stories

CM Nara Chandrababu Naidu Speech: మెప్మా, డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | Asianet Telugu
Pemmasani Chandrasekhar Spech: 25 సంవత్సరాల ముందు చంద్రబాబు విజన్ ఈ సంఘాలు| Asianet News Telugu