బాత్రూం నుంచి బెడ్ రూమ్ వరకు రక్తం.. మహిళ దారుణహత్య

Published : Dec 27, 2018, 01:57 PM IST
బాత్రూం నుంచి బెడ్ రూమ్ వరకు రక్తం.. మహిళ దారుణహత్య

సారాంశం

మహిళను దారుణంగా హత్య చేసి.. ఆమె మృతదేహంపై చీరలు, దుప్పట్లు కప్పేసారు. బాత్రూం నుంచి బెడ్ రూమ్ వరకు రక్తం దారలుగా కారి ఉండటం కలకలం రేపుతోంది.

కడప జిల్లా రాజంపేటలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను దారుణంగా హత్య చేసి.. ఆమె మృతదేహంపై చీరలు, దుప్పట్లు కప్పేసారు. బాత్రూం నుంచి బెడ్ రూమ్ వరకు రక్తం దారలుగా కారి ఉండటం కలకలం రేపుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓబులవారిపల్లె వాసి శ్రీనివాసుల రెడ్డికి పుల్లంపేట మండలం తిరుమలయ్యగారిపల్లెకు చెందిన సుజాతతో వివాహమైంది. నలందా నగర్‌లో కాపురమున్న సుజాత భర్త శ్రీనివాసులరెడ్డి, కుమారుడు దినేష్‌ రెడ్డి కువైట్‌లో ఉన్నారు. మరో కుమారుడు కిషోర్‌ తిరుపతిలో బీటెక్‌ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఆమె దారుణంగా హత్యకు గురైంది. 

ఆమె శరీరాన్ని పూర్తిగా చీరలు, బట్టలతో కప్పి ఉంచారు. సంఘటనా స్థలం వద్ద మృతదేహం పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉంది. బాత్రూం మొదలు బెడ్‌ రూం వరకు రక్తపుమడుగు ఉండడంతో ఆమె హత్య విషయం అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం రాత్రి భర్తతో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తరువాత ఆమె సెల్‌ఫోన్‌ పనిచేయకపోవడంతో.. ఆమె భర్త ఈ విషయాన్ని బంధువులకు తెలియజేశాడు. వారు తలుపులు పగలకొట్టి చూడగా.. శవమై కనిపించింది.  

బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu