విషాదం: బైక్‌పై 20 కి.మీ. తల్లి మృతదేహన్ని తీసుకెళ్లిన కొడుకు

Published : Apr 27, 2021, 01:25 PM IST
విషాదం: బైక్‌పై 20 కి.మీ. తల్లి మృతదేహన్ని తీసుకెళ్లిన కొడుకు

సారాంశం

తల్లి మృతదేహాన్ని బైక్‌పై 20 కి.మీ తీసుకెళ్లాడు ఓ కొడుకు . ఈ  ఘటన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. 

శ్రీకాకుళం: తల్లి మృతదేహాన్ని బైక్‌పై 20 కి.మీ తీసుకెళ్లాడు ఓ కొడుకు . ఈ  ఘటన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని పలాస నియోజకవర్గంలోని మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన జి. చెంచెల అనే మహిళ ఇటీవల అనారోగ్యానికి గురైంది.  దీంతో ఆమెను కొడుకు బైక్ పై పలాసలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.  ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తీసుకొన్న తర్వాత స్కానింగ్ కోసం కాశీబుగ్గలోని శ్రీకృష్ణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ పూర్తి చేసిన  తర్వాత  ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. 

మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించేందుకు కొడుకు ప్రయత్నించాడు. కానీ అంబులెన్స్ డ్రైవర్లు ముందుకు రాలేదు. ఇతర వాహనాలు కూడ మృతదేహం తరలించేందుకు ఇష్టపడలేదు. ఇక చేసేదీలేక తాము వచ్చిన బైక్ పైనే మృతదేహాన్ని కూర్చోబెట్టుకొని  తమ స్వగ్రామం కిల్లోయికి చేరుకొన్నాడు కొడుకు. బైక్ పై  తల్లి మృతదేహాన్ని తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తించిన మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ దీనావస్థను మృతురాలి కొడుకు మార్గమధ్యలోని విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ కు వివరించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్