ఆక్సిజన్ నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి: ఏపీ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్న

By narsimha lodeFirst Published Apr 27, 2021, 12:31 PM IST
Highlights

రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 

అమరావతి:  రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏపీ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం నాడు  హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు తెరిచారా అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారని ప్రశ్నించింది హైకోర్టు. టెస్టులు పెంచారా లేదా అని ఉన్నత న్యాయస్థానం అడిగింది.

కరోనా రోగులకు సరిపడు ఆసుపత్రులు, బెడ్స్ ఉన్నాయా అని హైకోర్టు ఆరా తీసింది. కరోనా టెస్టులు చేయించుకొన్న రోగికి ఎన్ని రోజుల్లో రిపోర్టులు ఇస్తున్నారని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను అడిగింది.గతంలో అయితే 3 రోజుల్లో రిపోర్టులు వచ్చేవన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం 36 గంటల్లోనే రిపోర్టులు రోగికి అందిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. అయితే ఈ సమయంలో రోగి పరిస్థితి ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. కరోనా కేసుల పరిస్థితిపై  విచారణను రేపటికి వాయిదా వేసింది. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం  కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. 

click me!