
ఆదోని : అందంగా ఉండటమే ఆమె పాలిట శాపంగా మారింది. భర్తలో అనుమానం భూతం రెక్కలు విప్పుకుంది. చివరికి అది పెనుభూతంగా మారి ఆమెను హత్య చేసే వరకు దారితీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగు చూసింది. తల్లి హత్యకు గురవడం, తండ్రి హంతకుడిగా మారడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. కళ్యాణ్ అలియాస్ చంటికి శిరీష (23) అనే మహిళతో ఐదేళ్ల కిందట పెద్దలు వివాహం చేశారు. వీరికి సంతానం ఇద్దరు మగపిల్లలు. కాగా పెళ్లైన కొద్ది రోజులనుంచి కల్యాణ్ కు భార్య మీద అనుమానం ఏర్పడింది.
ఫేస్ బుక్ లో మహిళతో స్నేహం.. అత్యాచారం చేసి.. బలవంతంగా మతమార్పిడి...!!
అది పెనుభూతంగా మారింది. దీంతో ఆమెను హత్య చేశాడు. దీనిమీద వన్ టౌన్ సీఐ విక్రమసింహ మాట్లాడుతూ... ఆదోనిలోి కిలిచిన పేటకు చెందిన నాగులు, వీరాభాయి కొడుకు కల్యాణ్. అతనికి కొంతకాలంగా భార్యమీద అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరచుగా గొడవకు దిగుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా భార్యభర్తలు తీవ్రంగా గొడవపడ్డారు.
ఆదివారం ఉదయం ఆ గొడవ నేపథ్యంలోనే భార్య శిరీషను చంటి టవల్ తో గొంతుకు ఉరివేసి చంపేశాడు. ఆ తరువాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు తమ చిన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడితే చూడడానికి వెళ్లారు.
ఇదిలా ఉండగా, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ కేసులో ఓ హౌస్ పెయింటర్ అయిన ప్రియుడితో పాటు ఆ మహిళను నేరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు రుషికేశ్ తుపే (24), అరుణా ముర్బే (36) అని నేరాల ఏపీఐ శివాజీ ధావలే తెలిపారు.
హత్యకు గురైన వ్యక్తిని కర్జాత్ తాలూకాలోని దేవ్‌పాడలో నివాసం ఉంటున్న ఆటోరిక్షా డ్రైవర్ సచిన్ ముర్బే (38)గా గుర్తించారు. అరుణ జూలై 15న నేరల్ పోలీస్ స్టేషన్‌లో సచిన్ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసింది. సచిన్ స్నేహితుడు, దూరపు బంధువు అయిన రుషికేశ్ ఆ సమయంలో అరుణతో పాటు వచ్చాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ ప్రవీణ్ లోఖండేకు సచిన్..రుషికేశ్ తో కలిసి దేవ్‌పాడ గ్రామంలోని ఆరి ఫారెస్ట్‌కు వేటకు వెళ్లారని, ఆ తర్వాత సచిన్ కనిపించకుండా పోయాడని తెలిసింది. ఇన్‌స్పెక్టర్ ధావలే మాట్లాడుతూ, "సచిన్‌ను వేటకు ఉపయోగించే రైఫిల్‌తో హత్య చేసినట్లు రుషికేశ్ అంగీకరించాడు. ఆ తర్వాత, సచిన్ మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు.
రెండు సెల్‌ఫోన్‌లను వాగులో విసిరేశాడు. సచిన్ ను పాతిపెట్టడానికి గొయ్యి తీయడానికి ఉపయోగించిన పలుగు, పార, హ్యాండిల్‌ను కూడా వివిధ ప్రదేశాలలో విసిరేశాడు" "సచిన్ సమాధిని గుర్తించేందుకు రుషికేశ్‌ను ఆరి ఫారెస్ట్‌కు తీసుకెళ్లారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కర్జాత్ సమక్షంలో అతని మృతదేహాన్ని వెలికితీశారు. దానిని పోస్ట్‌మార్టం కోసం జెజె ఆసుపత్రికి పంపారు" అని ధావలే తెలిపారు.