చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి: జగన్ హామీ

By narsimha lode  |  First Published Jan 6, 2021, 2:02 PM IST

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
 


అమరావతి: ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణించారు. కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణారెడ్డి ఆయన మరణించాడు.

చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు పరామర్శించారు. చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథరెడ్డితో అరగంటపాటు సీఎం జగన్ ఇవాళ భేటీ అయ్యారు. 

Latest Videos

undefined

also read:కరోనా : ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవిని భగీరథ రెడ్డికి ఇవ్వనున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. చల్లా రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 

2019 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఇటీవల కాలంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని వైసీపీ కట్టబెట్టింది. చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో  ఆయన తనయుడు భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఇవాళ ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో తెలిపారు.

click me!