రాఖీ కట్టిన రెండు గంటల్లోనే, విగతజీవిగా మారిన చెల్లి... షాక్ లో అన్నయ్య...

Published : Aug 23, 2021, 07:46 AM IST
రాఖీ కట్టిన రెండు గంటల్లోనే, విగతజీవిగా మారిన చెల్లి... షాక్ లో అన్నయ్య...

సారాంశం

రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడికి తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసి నిశ్చేష్టులయ్యారు. తిరిగి వచ్చేసరికి మార్చురీ బాక్సులో పెట్టిన మృతదేహాన్ని చూసి భోరుమన్నారు. అత్తింటివారే ఆమె మరణానికి కారకులని బంధువులు ఆరోపిస్తున్నారు.

విజయవాడ : ప్రేమతో అన్నయ్యకు రాఖీ కట్టింది. తర్వాత రెండు గంట్లోలనే ఆ చెల్లెలు శవమై కనిపించింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం విజయవాడ అరండల్పేటలో  చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడికి తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసి నిశ్చేష్టులయ్యారు. తిరిగి వచ్చేసరికి మార్చురీ బాక్సులో పెట్టిన మృతదేహాన్ని చూసి భోరుమన్నారు. అత్తింటివారే ఆమె మరణానికి కారకులని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండల్ పేటకు చెందిన ఫణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

భర్త మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్ వేర్ ఇంజినీర్. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన సోదరిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్లానని, తర్వాత రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని సమాచారం ఇచ్చారంటూ విలపించారు. 

ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన ఉషను ఆసుపత్రికిి తీసుకువెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని భర్త, ఇతర బంధువులు చెబుతున్నారు. యువతి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దక్షిణ ఏసీపీ ఎన్. వెంకటేశ్వర్లు, సీఐ సూర్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: కాకినాడ లో డిప్యూటీ సీఎం పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Spech: మీ భూమి మీ హక్కు రాజ ముద్రతో పట్టా ఇస్తా | Asianet News Telugu