రమ్య హత్య కేసు: ఏపీ పోలీసుల సంఘాన్ని నాపైకి ఉసిగొల్పుతున్నారు.. నారా లోకేశ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 22, 2021, 09:35 PM IST
రమ్య హత్య కేసు: ఏపీ పోలీసుల సంఘాన్ని నాపైకి ఉసిగొల్పుతున్నారు.. నారా లోకేశ్ వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తనపైకి ఉసిగొల్పుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పోలీసు అధికారుల సంఘాన్ని ఉసిగొల్పడానికి చూపించిన శ్రద్ధ మహిళల రక్షణ కోసం చూపించి ఉంటే మీ పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు

ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో బలైన సంగతి తెలిసిందే. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రానికి విడిచిపెట్టారు. ఆ సందర్భంగా నారా లోకేశ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. 21 రోజుల్లోగా రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే తాము తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని లోకేశ్ హెచ్చరించారు.

తాజాగా ఈ అంశంపై లోకేశ్ మరోసారి స్పందించారు. తాను విధించిన డెడ్ లైన్ కు ఇంకా 14 రోజులే మిగిలున్నాయని ఆయన స్పష్టం చేశారు. విద్యావంతురాలైన రమ్యని హత్యచేసిన వాడికి ఉరి ఎప్పుడు? అని ప్రశ్నించారు.

Also Read:కర్నూలు: నారా లోకేశ్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నం.. ఉద్రిక్తత

కాగా, ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తనపైకి ఉసిగొల్పుతున్నారని లోకేశ్ ఆరోపించారు. పోలీసు అధికారుల సంఘాన్ని ఉసిగొల్పడానికి చూపించిన శ్రద్ధ మహిళల రక్షణ కోసం చూపించి ఉంటే మీ పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టి మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని లోకేశ్ హితవు పలికారు

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!