పుకార్లతో మనస్తాపం?: మహిళా ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

By telugu teamFirst Published May 9, 2021, 8:24 AM IST
Highlights

గుంటూరు జిల్లాలోని చుండూరు పోలీస్ స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. వారిద్దరు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. చుండూ పోలీసు స్టేషన్ ఎస్ఐ శ్రావణి, అదే స్టేషన్ లో పనిచేస్తూ ఒక రోజు ముందు వీఆర్ లోకి వెళ్లిన కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. 

గత ఏడాది అక్టోబర్ లో శ్రావణి చుండూరు పోలీసు స్టేషన్ లో ఎస్సైగా చేరారు. రవీంద్ర ఐదేళ్ల నుంచి అక్కడే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఎస్సై శ్రావణితో సన్నిహితంగా మెలిగేవాడని అంటున్నారు 

ఎస్సై శ్రావణి సనివారంనాడు స్టేషన్ కు రాలేదని, వారిద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే విషయం తెలియదని సీఐ రమేష్ బాబు చెప్పారు. అయితే, వారిద్దరు కారులో వెళ్లి ముందుగా తెనాలిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరారని చెప్పారు. 

ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం 1008 ద్వారా గుంటూరులోని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. వారు అపస్మారక స్థితిలో ఉన్నారని, సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుంటామని అన్నారు.

గతంలో నరసరావు పేట దిశ పోలీస్ స్టేషన్లో పని చేసిన శ్రావణి స్వస్థలం ప్రకాశం జిల్లా కాగా కానిస్టేబుల్ రవీంద్ర స్వస్థలం గుంటూరు జిల్లా కార్ల పాలెం ఉన్నత పోలీస్ అధికారి వేదింపులు వల్లే ఆత్మ హత్య యత్నం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి గత కొద్ది కాలంగా శ్రావణి, రవీంద్ర అన్నాచెల్లెళ్లుగా కలిసి ఉండటంతో పుకార్లు చెలరేగాయి.రవీంద్ర ను తన పెద్ద   కొడుకుగా శ్రావణి కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటూ వచ్చాడు.

click me!