ఇంటి నుంచి నెట్టేసిన ఓనర్: వృద్ధురాలికి ఆసరా కల్పించిన ఎస్సై

Published : May 09, 2021, 07:47 AM IST
ఇంటి నుంచి నెట్టేసిన ఓనర్: వృద్ధురాలికి ఆసరా కల్పించిన ఎస్సై

సారాంశం

ఓ వృద్ధురాలిని ఇంటి యజమానికి బయటకు నెట్టేశాడు. అయితే ఎస్సై చిన్నబాబు తన సిబ్బందితో కలిసి ఆమెకు ఆసరా కల్పించారు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట పద్మావతి నగర్ లో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల వృద్ధురాలు. కరోనా వచ్చిందని వృద్ధురాలు ని ముందు వెనకా ఆలోచించకుండా నడిరోడ్డు మీదకు నెట్టేసిన ఇంటి ఓనర్. విషయం తెలుసుకున్న మహిళా సంరక్షణ కార్యదర్శి, విషయం జగ్గయ్యపేట ఎస్సై చిన్న బాబుకు తెలియజేయగా వెంటనే స్పందించిన ఎస్ఐ చిన్న బాబు. 

సిబ్బందితో సహా అక్కడకు చేరుకొని ఇంటి ఓనర్ ని హెచ్చరించి ఎవరి ఆదరణ లేని ఆమెను ఆ స్థితిలో తిరిగి ఆ  ఇంట్లోనే ఉండేటట్టుగా మాట్లాడి,  సామానంతా ఇంట్లో పెట్టించి, పురపాలక సంఘం వారి సహాయంతో ఆ ఇంటిని పరిసర ప్రాంతం అంతటిని శానిటైజ్ చేసేలా ఎస్సీ, ఆయన సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

జగ్గయ్యపేట గురుకుల పాఠశాల నందు అన్ని సౌకర్యాలతో నెలకొల్పబోతున్న వంద పడకల కోవిడ్ ఆసుపత్రి నందు, మొట్ట మొదటి పేషంట్ గా ఎవరి ఆదరణ లేని ఆమెను చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించేల చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?