పిల్లలు దూరంగా ఉంటున్నారనే వేదన.. బంగారు నగలు ధరించి, రూ. 7 లక్షల నగదుతో సహా నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య..

Published : May 21, 2022, 09:34 AM IST
 పిల్లలు దూరంగా ఉంటున్నారనే వేదన.. బంగారు నగలు ధరించి, రూ. 7 లక్షల నగదుతో సహా నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య..

సారాంశం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదంలో చోటుచేసుకుంది. ఉద్యోగాలు, పెళ్లిళ్ల కారణంగా కన్నబిడ్డలు దూరంగా ఉండడాన్ని భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని బలవనర్మణానికి పాల్పడింది.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదంలో చోటుచేసుకుంది. ఉద్యోగాలు, పెళ్లిళ్ల కారణంగా కన్నబిడ్డలు దూరంగా ఉండడాన్ని భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని బలవనర్మణానికి పాల్పడింది. రూ. 7 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలకు కూడా తనతో పాటే నిప్పింటించింది. వివరాలు.. దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన కోట్ల రామారావు, కుమారి దంపతులు రెండున్నరేళ్ల నుంచి రామిరెడ్డిపేటకు నరసరావుపేట రామిరెడ్డిపేటలో రెండున్నరేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. 

ఈ దంపతులకు సునీత, అనురాధ, ఆంజేయులు సంతానం ఉన్నారు. ముగ్గురికి వివాహాలు కావడం, ఉద్యోగాలతో వారు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చిన్న కూతురు సునీత మూడు నెలల క్రితం అమెరికాకు వెళ్లింది. అయితే తన పిల్లలు దూరంగా ఉండటాన్ని కుమారి భరించలేకపోయింది. ఆఖరికి తనతో పాటు ఉన్న మనవడిని కూడా కూతురు తీసుకెళ్లిపోవడంతో మరింత మానసిక ఒత్తిడికి లోనైంది. 

ఈ క్రమంలోనే భర్త బయటకు వెళ్లిన సమయంలోబంగారు నగలన్నింటినీ ధరించింది. రూ. 7లక్షల నగదు, ఆస్తి పత్రాలతో సహా.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు వస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు.. మంచంపై కుమారి మృతదేహాన్ని గుర్తించారు. బంగారు ఆభరణాలు ధరించి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెప్పారు.  

కుమారి కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతోందనిఆమె  భర్త రామారావు చెప్పారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే