సముద్రంలో దూకి టీడీపీ నేత ఆత్మహత్య... కారణమదేనా...!

By SumaBala BukkaFirst Published May 21, 2022, 7:15 AM IST
Highlights

భీమిలిలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీడీపీ నేత సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. అయితే దీనికి కారణం మానసిక సమస్యలే అని వారు అంటున్నారు. 

భీమిలి : Psychological problemsలతో బాధపడుతున్న భీమిలికి చెందిన tdp leader ఒకరు శుక్రవారం తెల్లవారుజామున సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై జి ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. bheemiliకి చెందిన దాసరి వెంకటేష్(57)  కిరాణా దుకాణం నిర్వహిస్తూ భీమిలి మూడో వార్డు టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కుమార్తె శ్రావణికి ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగింది.

ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ వెంకటేష్ కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున భీమిలి సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని కొంతమంది మార్నింగ్ వాక్ కు వెళ్ళిన వారు గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని మృతుడి కుమారుడు గోపీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశాయి. 

ఇదిలా ఉండగా, శుక్రవారం కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో మృతదేహం కలకలం రేపింది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది. గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యంగా ఆ యువకుడిని గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకుని ఎమ్మెల్సీ తీసుకెళ్లారని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకొని వచ్చారు.  కాగా, బాధితుల ఆందోళనతో అనంతబాబు కారు వదిలి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యంను హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ మాత్రం రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కాగా, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ మృతిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే శనివారం కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. ఈ కమిటీలో పితాని సత్యనారాయణ, నక్కా ఆనందబాబు, ఎంఎస్ రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావులను సభ్యులుగా చంద్రబాబు నాయుడు నియమించారు. 

సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ఎమ్మెల్సీ ఉదయబాబే కారణమం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీని శుక్రవారం నాడు ఉదయం పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఉదయ్ బాబుకు సుబ్రమణ్యం రూ. 20వేలు బకాయి ఉన్నాడు. ఈ విసయం మీద సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తరచూ అడిగేవాడని చెబుతున్నారు. కొంత సమయం ఇస్తే ఈ డబ్బులు తిరిగి ఇస్తానని సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి చెప్పారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు  కూడా మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. సుబ్రమణ్యం చనిపోవడానికి  డబ్బుల వ్యవహరమే కారణమా ఇంకా ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

click me!