ఒకరు ప్రేమించానని.. మరొకరు బెదిరించి... యువతిపై..

Published : Dec 19, 2019, 11:07 AM ISTUpdated : Dec 19, 2019, 11:08 AM IST
ఒకరు ప్రేమించానని.. మరొకరు బెదిరించి... యువతిపై..

సారాంశం

తన కోరిక తీర్చకుంటే.. మీ ప్రేమ విషయం గ్రామంలో అందరికీ చెప్పేస్తాననా బెదిరించాడు. దీంతో... ఆ యువకుడికి కూడా యువతి లొంగిపోవాల్సి వచ్చింది. చివరకు యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత... ఇద్దరూ యువకులు మాకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం

ఒకరు ఆ యువతిని ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని  కూడా చెప్పాడు. అతను చెప్పిన మాటలను ఆ యువతి పూర్తిగా నమ్మేసింది. అతనికి శారీరకంగా  దగ్గరైంది. మరోవైపు.. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న మరో యువకుడు సదరు యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు.

 తన కోరిక తీర్చకుంటే.. మీ ప్రేమ విషయం గ్రామంలో అందరికీ చెప్పేస్తాననా బెదిరించాడు. దీంతో... ఆ యువకుడికి కూడా యువతి లొంగిపోవాల్సి వచ్చింది. చివరకు యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత... ఇద్దరూ యువకులు మాకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఈ సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. 

ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో ఇద్దరూ తమకు సంబంధం లేదంటూ తిరగడం మొదలుపెట్టారు. యువతి శరీరంలో వస్తున్న మార్పులను గుర్తించిన కుటుంబసభ్యులు కుమార్తెను మందలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

దీంతో.. యువతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని  గ్రామ పెద్దలకు తెలియజేశారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu