ప్రియుడితో సరసాలు.. భర్తకు పాయసంలో నిద్రమాతలు కలిపి..

By telugu news teamFirst Published Apr 27, 2020, 8:25 AM IST
Highlights

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళను పథకం ప్రకారం చంపేసింది. అనంతరం దానిని ప్రమాదవశాత్తు జరిగిన హత్యగా చిత్రీకరించింది.

మానవ సంబంధాలు రోజు రోజుకీ మరీ దారుణంగా తయారౌతున్నాయి.కట్టుకున్న భర్త ని వదిలేసి  చాలా మంది మహిళలు ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల వెంట పడుతున్నారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్నారంటూ భర్త, కొందరైతే ఏకంగా పిల్లలను కూడా చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళను పథకం ప్రకారం చంపేసింది. అనంతరం దానిని ప్రమాదవశాత్తు జరిగిన హత్యగా చిత్రీకరించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని గిప్సన్‌ కాలనీకి చెందిన రామనాయుడుకు 17 ఏళ్ల క్రితం నిర్మల అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రామానాయుడు మద్యానికి బానిసై, నిత్యం భార్యను వేధించేవాడు.

భర్త తాగుడు మానుకోకపోవడంతో కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో నిర్మల రెండేళ్ల క్రితం ఎస్‌ఎల్‌ఎన్‌ కేవీ ఫుడ్‌ ఫ్యాక్టరీలో స్వీపర్‌గా చేరింది. అక్కడ కిషోర్‌బాబు అనే వ్యక్తితో పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు తరుచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో తన భర్తను ఎలాగైనా చంపేయాలని కిషోర్‌ను కోరింది. 

ఆమె కోరికను మన్నించిన కిషోర్.. రామానాయుడిని చంపేందుకు ప్లాన్ వేశాడు. అందుకోసం మరో ముగ్గురి సహాయం తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. మార్చి 22, జనత కర్ఫ్యూ రోజున రామానాయుడుకి నిర్మల పాయాసం ఇచ్చింది. అందులో నిద్రమాత్రలు కలిపింది. పాయసం తిన్న రామానాయుడు నిద్రమత్తులోకి జారుకున్నాడు. 

ఆ రాత్రి 11 గంటల సమయంలో విజయ్‌, రాకేష్‌, కిషోర్‌ ఆటోలో వీరి ఇంటికి వచ్చారు. నిద్రిస్తున్న రామానాయుడుని గొంతుపై కాలుపెట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకుని నంద్యాల రోడ్డులో ఉన్న దిన్నెదేవర పాడు వంతెన ఫీట్‌ రోడ్డుకు వద్దకు తీసుకువెళ్లి పడేశారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై ఆటోను ఎక్కించారు.

ఆ మరుసటి రోజు తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ తబ్రేజ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికతో ఘటనపై అనుమానాలు తలెత్తాయి. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నిర్మల ప్రవర్తన గురించి ఆరా తీశారు.

విచారణలో అది ప్రమాదం కాదని.. హత్య అని తేలింది. దీంతో.. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!