ఏపీలో నలుగురు రాజ్ భవన్ సిబ్బందికి కరోనా పాజిటివ్

By telugu teamFirst Published Apr 27, 2020, 6:34 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్,  వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్,  వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. గవర్నర్ కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. 

విజయవాడలో  ఆదివారం సుమారు 30కేసులు నమోదయ్యాయి. కృష్ణలంకలో 3, మాచవరంలో  2, రైల్వే ఆస్పత్రిలో 2 కేసులు నమోదయ్యాయి.మాచవరం పీఎస్ లో నాలుగు, నున్నలో ఒక కేసులు రికార్డయ్యాయి, సైబర్ సెల్ మహిళా ఎస్సైకి పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

ఇదిలావుంటే, తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో కరోనా అనుమానపు కేసు నమోదైంది. అమీనుద్దిన్ అనే ఎస్ఐ కొంతకాలంగా విధులు నిర్వహిస్తూ రాయపూడిలో బంధువుల వద్ద ఉంటున్నాడు. అతనికి తూర్పు గోదావరి జిల్లా కు చెందిన ఫాతిమాతో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరికీ జ్వరం రావడంతో కరో నా  అనుమానిత కేసుగా  అధికారులు  వైద్య పరీక్షలకు పంపారు. ఒకే ఇంటిలో ఏడుగురు వుంటున్నారని భౌతిక దూరం పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలావుంటే, శనివారం ఉదయం 10  నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి.

click me!