ప్రియుడు దూరం పెట్టాడని: అతని కొడుకుని చంపిన మహిళ

Siva Kodati |  
Published : May 17, 2019, 11:34 AM IST
ప్రియుడు దూరం పెట్టాడని: అతని కొడుకుని చంపిన మహిళ

సారాంశం

వివాహ బంధానికి ఓ బాలుడి నిండు ప్రాణం బలైంది.. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేటకి చెందిన కాకుమూడి రత్నమ్మతో అదే గ్రామానికి చెందిన కన్నెలూరి శ్రీనివాస్‌కు వివాహేతర సంబంధం ఉండేది

వివాహ బంధానికి ఓ బాలుడి నిండు ప్రాణం బలైంది.. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేటకి చెందిన కాకుమూడి రత్నమ్మతో అదే గ్రామానికి చెందిన కన్నెలూరి శ్రీనివాస్‌కు వివాహేతర సంబంధం ఉండేది.

కొంతకాలం సజావుగా సాగినా బంధం తర్వాత బెడిసికొట్టింది. దీంతో శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్న రత్నకుమారి అతని ఐదేళ్ల కుమారుడు భానుచంద్రను కిడ్నాప్ చేసి హత్య చేసింది. బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు.

అనుమానంతో గ్రామస్తులు రత్నమ్మ ఇంట్లోకి వెళ్ళి వెతగ్గా ఆమె ఇంట్లోని మిద్దె మెట్ల కింద గోనె సంచిలో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో శ్రీనివాస్ కలువాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు రత్నమ్మపై హత్య కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు సంవత్సరం పాటు సాగిన విచారణలో రత్నకుమారి నేరం రుజువుకావడంతో ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు ఒకట అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu