
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. గురువారం కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను జగన్ దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించారు. దివంగత ముజావర్‌కు వైసీపీ చీఫ్ నివాళలుర్పించారు. ఆయన వెంట కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, నేతలు, కార్తకర్తలు ఉన్నారు.