గుంటూరులో పట్టపగలే కిడ్నాప్... భర్త ఎదుటే భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు

Arun Kumar P   | Asianet News
Published : Jul 16, 2021, 03:52 PM IST
గుంటూరులో పట్టపగలే కిడ్నాప్... భర్త ఎదుటే భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు

సారాంశం

పట్టపగలు నడిరోడ్డుపై భర్త తోడుండగానే ఓ వివాహితను కొందరు దుండగులు కిడ్నాప్ చేసిన సంఘటన గుంటూరు పట్టణంలో చోటుచేసుకుంది. 

గుంటూరు: వారిద్దరు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు. మూడు నెలలుగా వీరి సంసారం సాపీగా సాగగా తాజాగా యువతిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా  బొల్లాపల్లి మండలం పెరురుపాడు గ్రామానికి చెందిన యువకుడు బొప్పుడి శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన  కాట్ల విజయలక్ష్మి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలకు దూరంగా గుంటూరులో కొత్తకాపురం పెట్టారు. 

read more  వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో... యువతిని వేధిస్తున్న స్నేహితురాళ్లు, రంగంలోకి సైబర్ క్రైమ్

గుంటూరులోని పాలకలూరు విజ్ఞాన్ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది విజయలక్ష్మి. ప్రస్తుతం బిటెక్ పరీక్షలు జరుగుతుండటంతో భార్యను శ్రీనివాస్ పరీక్షా కేంద్రానికి తీసుకువెళుతుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకుని విజయలక్ష్మిని కిడ్నాప్ చేశారు. 

తన భార్య కిడ్నాప్ పై పోలీసులకు పిర్యాదు చేసిన శ్రీనివాసరావు అత్తింటివారిపై అనుమానం వ్యక్తం చేశారు.  గత కొన్నిరోజులుగా యువతి తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నరాని శ్రీనివాసరావు పోలీసులకు తెలిపాడు. తన భార్య ఆచూకీ కనుగొని తిరిగి తమను ఒకటి చేయాలంటూ నల్లపాడు పోలీసులను వేడుకుంటున్నాడు బాధితుడు శ్రీనివాసరావు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu