రాజమండ్రిలో కొత్త రకరం వైరస్ కలకలం: తప్పించుకు వచ్చిన మహిళకు వైరస్

Published : Dec 24, 2020, 07:04 AM IST
రాజమండ్రిలో కొత్త రకరం వైరస్ కలకలం: తప్పించుకు వచ్చిన మహిళకు వైరస్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. కొత్తరకం వైరస్ బారిన పడిన ఓ మహిళ ఢిల్లీ క్వారంటైన్ నుంచి తప్పించుకుని రాజమండ్రి చేరుకున్నట్లు తెలుస్తోంది.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) నుంచి వచ్చిన ఓ  మహిళకు ఈ కొత్త వైరస్ సోకినట్లు తెలుస్తోంది. యుకె నుంచి ఢిల్లీకి చేరుకున్న మహిళను అక్కడి ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు.

అయితే, ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకుని ఏపీ ఎక్స్ ప్రెస్ లో పారిపోయి రాజమండ్రికి చేరుకుంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో రెండు ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేశారు. మహిళను, ఆమె కుమారుడిని ఐసోలేషన్ గదులకు పంపించారు. 

అయితే, ఆ మహిళకు పాత కరోనా వైరస్ సోకిందా, కొత్త మ్యుటేషన్ వైరస్ సోకిందా అనేది తేలాల్సి ఉంది. కుమారుడి కోసం ఆమె రాజమండ్రి తిరిగి వచ్చింది. ఆమె రక్తనమూనాలను సేకరించి పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.

కొత్త రకం కోవిడ్ వైరస్ యుకెను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో యుకె నుంచి భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. యుకె నుంచి వచ్చినవారిని క్వారంటైన్ కు పంపిస్తున్నాయి. 

కొత్త రకం వైరస్ వ్యాప్థి నేపథ్యంలో భారత ప్రభుత్వం బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేసింది. ఆ గడువుోగా స్వదేశానికి చేరుకున్న ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి నాలుగు విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నవారిలో 11 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయఇంది. మరో 50 మందిని కూడా క్వారంటైన్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu