కదులుతున్న రైల్లో మహిళకు పురటినొప్పులు.. తల్లీబిడ్డా క్షేమం...

Published : Oct 14, 2023, 11:26 AM IST
కదులుతున్న రైల్లో మహిళకు పురటినొప్పులు.. తల్లీబిడ్డా క్షేమం...

సారాంశం

తాడేపల్లిగూడెంలో కదులుతున్న రైలులో ప్రసవ నొప్పులు వచ్చిన మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రసవించింది. 

కాకినాడ : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 23 ఏళ్ల యువతి శుక్రవారం రైలులో మగబిడ్డకు జన్మనిచ్చింది. రష్మిత, ఆమె భర్త సుశాంత్ కుమార్ డెలివరీ కోసం కోయంబత్తూరు నుండి బాలమ్‌గిర్‌కు ధరి ఆబా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు.

మార్గమధ్యలోనే రష్మితకు ప్రసవ నొప్పులు రావడంతో విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు. వారు తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి రష్మితను తీసుకెళ్లారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?