విశాఖలో వైద్యురాలి ఫ్యామిలీకి వేధింపులు.. భర్తతో బైక్‌పై వెళ్తుండగా బెదిరింపులు.. ఎమ్మెల్యే అనుచరుడి పనేనా?

Published : Aug 14, 2022, 10:32 AM IST
విశాఖలో వైద్యురాలి ఫ్యామిలీకి వేధింపులు.. భర్తతో బైక్‌పై వెళ్తుండగా బెదిరింపులు.. ఎమ్మెల్యే అనుచరుడి పనేనా?

సారాంశం

విశాఖపట్నంలో రౌడీ మూక రెచ్చిపోయింది. మహిళా డాక్టర్ కుటుంబంపై వేధింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. తాము పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ అనుచరులమని చెప్పి రెచ్చిపోయారు. 

విశాఖపట్నంలో రౌడీ మూక రెచ్చిపోయింది. మహిళా డాక్టర్ కుటుంబంపై వేధింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. తాము పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ అనుచరులమని చెప్పి రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. పెందుర్తి వేగివారి వీధివారి ప్రాంతానికి చెందిన ఓ మహిళ హోమియో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త శేషు ప్రశాంతినగర్‌ సమీపంలో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. 

ఆ దంపతులు శుక్రవారం  రాత్రి ఓ ఫంక్షన్‌కు హాజరై ఇంటికి తిరిగివస్తున్నారు. ఆ సమయంలో మర్రిచెట్ల కాలనీకి చెందిన మనోహర్‌, అతని స్నేహితుడు కల్యాణ్‌ బైక్‌పై దంపతులను అనుసరించారు. అయితే శేషు వారిని వారించారు. దీంతో మనోహర్, కల్యాణ్‌లు మరింతంగా  రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే  మనోహర్‌  బైక్‌ పైకి ఎక్కి ఇప్పుడు ఏమైందంటూ రచ్చ రచ్చ చేశాడు. పొడిచి పారేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. శేషు భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. 

ఇక, ఈ ఘటనపై బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే మనోహర్ ఎమ్మెల్యే అదీప్ అనుచరుడని స్థానికులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జగన్ ను అడ్డంగా ఇరికించిన సాయిరెడ్డి | Vijaysai Reddy On YS Jagan | Asianet News Telugu
Vizag Beach: గోవా దేనికి గురూ? వైజాగ్ తీరంలో ఈ టాప్ 5 బీచ్ రిసార్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే