పల్నాడులో అమానుషం... అరవయ్యేళ్ల వృద్దురాలిపై తాగుబోతు యువకుడి హత్యాచారం

Published : Aug 14, 2022, 09:54 AM IST
పల్నాడులో అమానుషం... అరవయ్యేళ్ల వృద్దురాలిపై తాగుబోతు యువకుడి హత్యాచారం

సారాంశం

పల్నాడు జిల్లాలో ఓ తాగుబోతు యువకుడు సభ్యసమాజం తలదించుకునేలా దారుణానికి ఒడిగట్టాడు. అరవయ్యేళ్ల వృద్దురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడమే కాదు అతి కిరాతకంగా హతమార్చాడు. 

నరపరావుపేట : కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ నీచుడు మద్యంమత్తులో పశువులా ప్రవర్తించాడు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన యువకుడు ఆరుబయట నిద్రిస్తున్న వ్యద్దురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం వృద్దురాలు ఎక్కడ బయటపెడుతుందోనని భయపడి అత్యాచారం అనంతరం అతి దారుణంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన శనివారం తెల్లవారుజామున పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ దారుణం గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. పగలూ రాత్రి అనే తేడా లేకుండా నిత్యం మద్యంమత్తులో మునిగితేలుతూ వుండేవాడు. ఇలా నిన్న (శనివారం) కూడా ఫుల్లుగా మద్యం సేవించి అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న అతడు ఇంటిబయట నిద్రిస్తున్న వృద్దరాలిని గమనించాడు. మద్యంమత్తులో వున్న అతడు విచక్షణ కోల్పోయి నీచానికి పాల్పడ్డాడు.

ఒంటరిగా వున్న వ‌ృద్దురాలు షేక్ మస్తాన్ బీ (65) అరవకుండా చూసి మణికంఠ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పెనుగులాటలో వృద్దిరాలి శరీరంపై గాయాలయ్యాయి. ఇలా పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఎక్కడ వృద్దురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందోనని భయపడిపోయిన యువకుడు అతి కిరాతకంగా హతమార్చాడు. వృద్దిరాలి ముఖాన్ని దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసాడు. వృద్దురాలు చనిపోయినట్లు నిర్దారించుకున్న మణికంఠ అక్కడినుండి వెళ్లిపోయాడు. 

Read More  Extramarital Affair: తండ్రి చనిపోయాడు.. తల్లి వివాహేతర సంబంధం.. కొడుకు ఏం చేశాడంటే?

తెల్లవారుజామున కుటుంబసభ్యులు మస్తాన్ బీ మంచంపై మృతిచెంది వుండటాన్ని గమనించారు. ఆమె శరీరంపై గాయాలుండటంతో అనుమానించిన వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకుని వృద్దురాలిపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఈ దారుణానికి పాల్పడింది మణికంఠగా గుర్తించారు. అతడిని తమదైన శైలిలో విచారించగా వృద్దురాలిపై అత్యాచారం చేసి హతమార్చినట్లు బయటపెట్టాడు. 

వృద్దురాలి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. తమ తల్లిని చంపిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని మస్తాన్ బీ ఇద్దరు కొడుకులు పోలీసులను కోరారు. వృద్ద మహిళపై అఘాయిత్యానికి పాల్పడటమే కాదు అతి కిరాతకంగా హతమార్చిన దారుణం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడు మణికంఠపై పల్నాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu