ఇష్టపడ్డ యువతి కరోనాతో మృతి.. మనస్తాపంతో ఆ ప్రియుడు చేసిన పని..

Published : Jul 22, 2021, 09:16 AM IST
ఇష్టపడ్డ యువతి కరోనాతో మృతి.. మనస్తాపంతో ఆ ప్రియుడు చేసిన పని..

సారాంశం

అనకాపల్లికి చెందిన యువతి గుంటూరులో కోవిడ్ తో చనిపోయందని బాధ పడేవాడని, మరో సంబంధం చూసి వివాహం చేస్తామని నచ్చజెప్పామని తండ్రి కృష్ణారావు కన్నీటిపర్యంతమయ్యారు.

గాజువాక : తాను ఎంతో ఇష్టపడిన అమ్మాయి కొవిడ్ బారిన పడి మూడు రోజుల క్రితం గుంటూరులో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక గాజువాకకు చెందిన యువకుడొకరు బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 

గాజువాక ఎస్ఐ సూర్యప్రకాశ్ తెలిపిన వివరాలు మేరకు... పరవాడ మండలం దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్ కుమార్ (25) ఇంటర్ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్ లో ఆన్ లైన్ పార్శిల్ సర్వీస్ లో పనిచేస్తున్నాడు.

ఆరుగురు మిత్రులతో కలిసి కణితిరోడ్డులో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వరకూ సహచర మిత్రులతో పార్శిల్ సర్వీసు కొనసాగించాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కడే తన రూంకు చేరుకుని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సాయంత్రం వచ్చిన మిత్రులు రోహిత్ మృతదేహాన్ని చూసి.. వెంటనే తల్లిదండ్రులకు సమాచార అందించారు. అనకాపల్లికి చెందిన యువతి గుంటూరులో కోవిడ్ తో చనిపోయందని బాధ పడేవాడని, మరో సంబంధం చూసి వివాహం చేస్తామని నచ్చజెప్పామని తండ్రి కృష్ణారావు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇంతలోనే ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదని వాపోయారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నినిమిత్రతం కేజీహెచ్ కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?