
ద్వారకా తిరుమల : భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఒక నిండు pregnant భక్తులను యాచిస్తూ అక్కడే ఆరుబటయ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దొరసానిపాడుకు చెందిన చిరపు నాంచారమ్మ Dwarka Thirumala శివాలయం వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఆదివారం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ నొప్పులు తట్టుకోలేక ఆ మహిళ ఓ పక్కగా ఒరుగుతూ నేల మీద పడిపోయింది. ఈ సమయంలో చుట్టుపక్కల చిన్న పిల్లలు తప్ప పెద్దవారు ఎవరూ లేరు. ఆ చిన్నపిల్లలే ఆ మహిళకు అడ్డుగా ఒక వస్త్రాన్ని ఉంచి సపర్యలు చేశారు. గమనించిన స్థానికులు 108క కాల్ చేసి సమచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చేలోపే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తల్లికి, బిడ్డకు వైద్య చికిత్సలు చేసి ఆసుపత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారు. ఆ యాచకురాలికి ఇది ఆరో కాన్పు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. తెలంగాణ లోని వికారాబాద్ లో 2020లో ఇలాంటి అమానవీయ ఘటన చోటు చేసుకుంి. నిండు చూలాలు నొప్పులతో తల్లడిల్లిపోతున్నా ఆ కసాయిల మనసు కరగలేదు. డాక్టర్లు లేరన్న సాకుతో గర్భిణిని వెనక్కి పంపించారు ఆ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది. అయితే అప్పటికే చాలాసేపటి నుండి నొప్పులతో తల్లడిల్లిన ఆ మహిళ అదే హాస్పిటల్ వరండాలోనే ప్రసవించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చోటుచేసుకుంది.
తాండూరు పట్టణం పక్కనే వున్న ఓ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే హాస్పిటల్ సిబ్బంది మాత్రం డాక్టర్లు లేరని చెప్పి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వెనక్కి పంపించారు. దీంతో చేసేదేమి లేక అక్కడి నుండి వెళ్లిపోతుండగా పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబసభ్యులతో పాటు అక్కడే వున్న కొందరు మహిళలు వరండాలోనే మహిళ ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. చుట్టూ చీరలు కట్టి ప్రసవం చేశారు. ఇదంతా చూస్తూనే వున్న ఆస్పత్రి సిబ్బంది కనీస సాయం కూడా చేయలేదు. అయితే చివరకు మహిళలు ఆ ఆరుబయటే బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ ఘటన మరోసారి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్ధితులను, సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. చేతిలో డబ్బులు లేక ఉచిత వైద్యం దొరుకుతుందని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే నిరుపేదలకు ఎలాంటి వైద్యం అందుతుందో ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుందని.. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాలపై దృష్టిసారించి మెరుగైన సేవలు అందేలా చూడాలని అక్కడున్నవారు కోరారు.