రేపు ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రాతో వైఎస్ జగన్ భేటీ

Siva Kodati |  
Published : Apr 24, 2022, 09:40 PM ISTUpdated : Apr 24, 2022, 09:42 PM IST
రేపు ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రాతో వైఎస్ జగన్ భేటీ

సారాంశం

సోమవారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్‌తో సీఎం తొలిసారి ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

రేపు సాయంత్రం ఏపీ హైకోర్టు (ap high court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రాతో (justice pk mishra) సీఎం జగన్ (ys jagan) భేటీ కానున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు సీజేను జగన్ కలవనున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్‌తో సీఎం తొలిసారి ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (justice nv ramana) వచ్చినప్పుడు మాత్రమే హైకోర్టు సీజేఐ, ఇతర న్యాయమూర్తులను జగన్ కలిశారు. ప్రత్యేకించి సీఎం, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంత వరకు భేటీ కాలేదు. కర్నూలును (kurnool) న్యాయ రాజధాని చేయాలని భావిస్తోన్న జగన్.. హైకోర్టు తరలింపుకు సంబంధించి సీజేఐతో చర్చించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!