ఫలించిన 20 గంటల శ్రమ, పులిచింతల ప్రాజెక్ట్‌కు స్టాప్‌లాక్‌ గేటు అమర్చిన అధికారులు

By Siva KodatiFirst Published Aug 8, 2021, 9:05 PM IST
Highlights

ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో పులిచింతల ప్రాజెక్టుకు ఉధృతంగా వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు వదిలేందుకు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు ఎత్తుతుండగా, ప్రాజెక్ట్‌‌లోని 16వ గేట్‌ హైడ్రాలిక్‌ గడ్డర్‌ తెగిపడడంతో క్రస్ట్‌గేటుతోపాటు మోటార్‌ మొత్తం 500 మీటర్ల వరకు వరద నీటిలో కొట్టుకుపోయింది. 

పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన 16వ నెంబరు క్రస్ట్‌ గేటు స్థానంలో ఆదివారం స్టాప్‌లాక్‌ గేటును అధికారులు ఎట్టకేలకు అమర్చారు. దాదాపు 20 గంటలపాటు, 80 మంది సిబ్బంది శ్రమించి గేటు ఏర్పాటుచేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో పులిచింతల ప్రాజెక్టుకు ఉధృతంగా వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు వదిలేందుకు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు ఎత్తుతుండగా, ప్రాజెక్ట్‌‌లోని 16వ గేట్‌ హైడ్రాలిక్‌ గడ్డర్‌ తెగిపడడంతో క్రస్ట్‌గేటుతోపాటు మోటార్‌ మొత్తం 500 మీటర్ల వరకు వరద నీటిలో కొట్టుకుపోయింది.

ALso Read:పులిచింతల ప్రాజెక్ట్: అడుగంటిన నీటిమట్టం.. బయటపడిన 16వ నెంబర్ గేట్

అప్పటినుంచి ఎగువ నుంచి వస్తున్న నీటితోపాటు, ప్రాజెక్ట్‌లో ఉన్న నీటిని ఖాళీ చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ ఉదయం వరకు 18గేట్ల ద్వారా 40 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు విడుదల  చేశారు. ప్రాజెక్ట్‌ నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి (5 నుంచి 6 టీఎంసీలకు) చేరగానే 16వ నెంబర్‌ క్రస్ట్‌గేట్‌ స్థానంలో స్టాప్‌లాక్‌ గేట్‌ను అమర్చారు.

click me!