నన్ను లొంగదీసుకుని, బెదిరిస్తున్నాడు: ఎస్ఐపై మహిళ ఫిర్యాదు

By narsimha lodeFirst Published Jul 2, 2020, 3:55 PM IST
Highlights

గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్ఐ జగదీష్ తనను మోసం చేశాడని ఓ మహిళ ఇవాళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జగదీష్ తో తనకు, తన కొడుకు ప్రాణహని ఉందని ఆమె ఆరోపించారు. 

గుంటూరు: గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్ఐ జగదీష్ తనను మోసం చేశాడని ఓ మహిళ ఇవాళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జగదీష్ తో తనకు, తన కొడుకు ప్రాణహని ఉందని ఆమె ఆరోపించారు. 

తనకు తన భర్తకు  మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలపై  2013లో నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా ఆమె చెప్పారు. ఆ సమయంలో ఈ పోలీస్ స్టేషన్ లో జగదీష్ ఎస్ఐగా పనిచేస్తున్నట్టుగా ఆమె తెలిపారు.

ఈ సమయంలో ఈ కేసు విషయమై మాట్లాడే పేరుతో తన ఫోన్ నెంబర్ తీసుకొన్నాడన్నారు. తనను ఎస్ఐ ఇంటికి పిలిపించుకొని బలవంతం చేసినట్టుగా ఆమె ఆరోపించారు. ఈ విషయమై తన భర్తకు తెలిసి గొడవలు పెద్దవయ్యాయని ఆమె తెలిపారు.

దీంతో తన భర్తకు విడాకులు ఇప్పించాడని ఆమె ఆరోపించారు.  2017లో జగదీష్ తనను రహస్యంగా వివాహం చేసుకొన్నాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుండి తనతో ఆయన సహజీవనం చేస్తున్నట్టుగా చెప్పారు. 

అయితే తన మొదటి భార్యతో గొడవలు చోటు చేసుకొన్నాయని తనను వదిలించుకొనే ప్రయత్నం చేశాడని ఆమె తెలిపారు. తాను తప్పుకోకపోతే తానొక వ్యభిచారిణి అంటూ సమాజానికి చెబుతానని బెదిరించాడన్నారు. మూడు రోజుల క్రితం స్టేషన్ కు పిలిపించి తనను తీవ్రంగా కొట్టారని ఆమె ఆరోపించారు.

మానసికంగా, శారీరకంగా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపారు. ఎస్ఐ జగదీష్ వల్ల తనకు తన కొడుకుకు ప్రాణహని ఉందన్నారు. తనకు న్యాయం చేయాలని ఆమె ఆ పిటిషన్ లో కోరారు. 
 

click me!